Telugu Global
NEWS

తూచ్.. తూచ్.. నేనెక్కడికీ వెళ్లనంటున్న బుచ్చయ్య..

“సీనియర్ నాయకుడ్ని కూడా గౌరవించరా, కనీసం ఫోన్లు చేసినా పట్టించుకోరా, లోకేష్ కి కూడా నేనంటే లెక్కలేదు, నా మాట ఎవరూ వినట్లేదు..” ఆమధ్య బుచ్చయ్య చౌదరి అలకబూని అన్నమాటలివి. పార్టీతోపాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ కాస్త గట్టిగానే మాట్లాడారాయన. ఆయన వాలకం తెలిసినవారు బుచ్చయ్య అలక టీకప్పులో తుపానేనని అప్పుడే తేల్చాశారు. కానీ అధికారికంగా ఆ మాట బుచ్చయ్య నోట రావడానికి ఇన్నిరోజులు టైమ్ పట్టింది. నేనెక్కడికీ పోను, పార్టీలోనే ఉంటా, రాజీనామా […]

తూచ్.. తూచ్.. నేనెక్కడికీ వెళ్లనంటున్న బుచ్చయ్య..
X

“సీనియర్ నాయకుడ్ని కూడా గౌరవించరా, కనీసం ఫోన్లు చేసినా పట్టించుకోరా, లోకేష్ కి కూడా నేనంటే లెక్కలేదు, నా మాట ఎవరూ వినట్లేదు..” ఆమధ్య బుచ్చయ్య చౌదరి అలకబూని అన్నమాటలివి. పార్టీతోపాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ కాస్త గట్టిగానే మాట్లాడారాయన. ఆయన వాలకం తెలిసినవారు బుచ్చయ్య అలక టీకప్పులో తుపానేనని అప్పుడే తేల్చాశారు. కానీ అధికారికంగా ఆ మాట బుచ్చయ్య నోట రావడానికి ఇన్నిరోజులు టైమ్ పట్టింది. నేనెక్కడికీ పోను, పార్టీలోనే ఉంటా, రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానంటూ బుచ్చయ్య తేల్చి చెప్పారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం బుచ్చయ్య మెత్తబడ్డారు. బయటకొచ్చి తాను పార్టీలోనే ఉంటానని ప్రకటించారు.

పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవమేనని చెప్పిన బుచ్చయ్య చౌదరి, తన మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరారని, వారి కోరిక మేరకు తాను పార్టీలోనే ఉంటున్నానని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలనే విషయాన్ని తాను అధినేత దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. పార్టీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటామని, సరిదిద్దుకుంటామని ప్రకటించారు.

తాను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని, ఇకపై కూడా పార్టీలోనే ఉంటానని, పార్టీకే సేవ చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానే కానీ, బెదిరించడానికో, పదవుల కోసమో తాను రాజీనామా ప్రకటన చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యం అని, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామని, వారిని ఉద్యమ బాటలోకి తీసుకెళ్తామని అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు బుచ్చయ్య చౌదరి. మొత్తమ్మీద బుచ్చయ్య చౌదరి రాజీనామా అంటూ హడావిడి చేసినా, చివరకు అదేంలేదని రాజీకొచ్చేశారు.

First Published:  2 Sept 2021 2:11 PM IST
Next Story