Telugu Global
Cinema & Entertainment

విశాల్ పాన్ ఇండియా సినిమా విశేషాలు

యాక్ష‌న్ హీరో విశాల్ తన పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. వినోద్ కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీ రాబోతోంది. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఆ వెంటనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్ర‌తినాయిక‌గా సునైన‌ నటిస్తోంది. తాజాగా వచ్చిన రాజ రాజ చోర సినిమాలో […]

విశాల్ పాన్ ఇండియా సినిమా విశేషాలు
X

యాక్ష‌న్ హీరో విశాల్ తన పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. వినోద్ కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీ రాబోతోంది. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఆ వెంటనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా
ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్ర‌తినాయిక‌గా సునైన‌ నటిస్తోంది. తాజాగా వచ్చిన రాజ రాజ చోర సినిమాలో సునైన
నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం మేక‌ర్స్ ఒక ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. అన్ని భాషలకు ఒకే టైటిల్ ఫిక్స్ చేశారు. అతి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా
ఉండ‌నుంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రించ‌నున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగ‌ల యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉంటాయట.

First Published:  1 Sept 2021 3:09 PM IST
Next Story