Telugu Global
Cinema & Entertainment

సీటీమార్ ట్రయిలర్.. పక్కా మాస్

`సౌత్ కా స‌త్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె` అని స‌వాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌. అస‌లు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే `సీటీమార్` సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది. సెప్టెంబ‌ర్ 10న బాక్సాఫీస్‌తో క‌లెక్ష‌న్స్ క‌బ‌డ్డీ ఆడ‌టానికి సిద్ధ‌మైన భారీ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్‌`. గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోహీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో నేష‌న‌ల్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న […]

సీటీమార్ ట్రయిలర్.. పక్కా మాస్
X

'సౌత్ కా స‌త్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె' అని స‌వాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌. అస‌లు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే 'సీటీమార్' సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది. సెప్టెంబ‌ర్ 10న బాక్సాఫీస్‌తో క‌లెక్ష‌న్స్ క‌బ‌డ్డీ ఆడ‌టానికి సిద్ధ‌మైన భారీ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా 'సీటీమార్‌'.

గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోహీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో నేష‌న‌ల్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న‌ ప్రేక్ష‌కుల‌ను ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అలరించడానికి సిద్ధంగా ఉన్న 'సీటీమార్‌' ట్రైల‌ర్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

'ఇక్క‌డ ఆడ‌పిల్ల‌లు వేసుకునే డ్రెస్ లెంగ్త్‌ను బ‌ట్టి క్యారెక్ట‌ర్ డిసైడైపోతుంది' అని రావు ర‌మేశ్ చెప్పిన డైలాగ్.. 'మ‌న‌దేశంలో మ‌గాళ్లు 60 ఏళ్లు బ‌తికి చ‌చ్చిపోతున్నారు. ఆడాళ్లు 60 ఏళ్లు బ‌తుకుతున్నారు కానీ 20 ఏళ్లకే చ‌చ్చిపోతున్నారు' అని గోపీచంద్ ఊరి జ‌నాన్ని ఉద్దేశించి చెప్పే మ‌రో డైలాగ్‌ ట్రయిలర్ లో హైలెట్స్ గా నిలిచాయి.

గోపీచంద్ మాస్ హీరోయిజం, త‌మ‌న్నా గ్లామ‌ర్‌తో పాటు.. ఈ సినిమాలో ఆమె మంచి పెర్ఫామెన్స్ రోల్
చేసింద‌ని తెలుస్తుంది. ఇక దర్శ‌కుడు సంప‌త్ నంది.. మ‌రోసారి త‌న‌దైన మార్క్ మూవీని భారీ లెవ‌ల్లో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించాడు.

First Published:  31 Aug 2021 1:40 PM IST
Next Story