చిరంజీవి షేర్ చేసిన బాపు కార్టూన్లు
తెలుగు తెరపై చెరగని సంతకం బాపు. తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆయన శైలి విలక్షణం. ఆయన ఎంచుకున్న కథలు నిత్యనూతనం. బాపు-రమణ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ బాపు పేరు చెబితే ముత్యాలముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లా లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, పెయింటర్ గా, కార్టూనిస్ట్ గా బాపు ఎంతో పేరు గడించారు. సరిగ్గా ఇదే కోణాన్ని ఈరోజు గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఈ రోజు బాపు వర్థంతి. ఈ సందర్భంగా […]
తెలుగు తెరపై చెరగని సంతకం బాపు. తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆయన శైలి విలక్షణం. ఆయన ఎంచుకున్న కథలు నిత్యనూతనం. బాపు-రమణ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ బాపు పేరు చెబితే ముత్యాలముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లా లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి.
కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, పెయింటర్ గా, కార్టూనిస్ట్ గా బాపు ఎంతో పేరు గడించారు. సరిగ్గా ఇదే కోణాన్ని ఈరోజు గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఈ రోజు బాపు వర్థంతి. ఈ సందర్భంగా బాపుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఆయన గీసిన కార్టూన్లలో తను కూడా ఓ భాగమైనందుకు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కొన్ని కార్టూన్లను చిరంజీవి షేర్ చేశారు.
“బహుముఖ ప్రజ్ఞాశాలి, అద్భుత చిత్రకారుడు, దిగ్దర్శకుడు, మహోన్నత మనీషి బాపు గారి వర్ధంతి
సందర్బంగా ఆ మహానుభావుడిని తలచుకుంటూ.. తెలుగు సంస్కృతి మీద ఆయనది చెరగని ముద్ర. ఆయన గీసిన కార్టూన్ల లో కూడా భాగమవటం నా అదృష్టం.”
చిరంజీవి-బాపు కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది.