Telugu Global
National

మహారాష్ట్రలో రివేంజ్ డ్రామా.. రాష్ట్ర మంత్రికి ఈడీ నోటీసులు..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై చెంపదెబ్బల వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ అయ్యారు. అయితే ఆ అరెస్ట్ ని కేంద్రం అంత తేలిగ్గా వదిలిపెడుతుందని ఎవరూ ఊహించలేదు. మోదీ, అమిత్ షా మౌనం వెనక ఏదో పరమార్థం ఉందనే అందరూ అనుకున్నారు. అనుకున్నంతా అయింది. రాణే అరెస్ట్ కు ప్రతీకారం తీర్చుకోడానికి కేంద్రం ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ ని రంగంలోకి దింపింది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అనిల్ పరబ్ కు […]

మహారాష్ట్రలో రివేంజ్ డ్రామా.. రాష్ట్ర మంత్రికి ఈడీ నోటీసులు..
X

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై చెంపదెబ్బల వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ అయ్యారు. అయితే ఆ అరెస్ట్ ని కేంద్రం అంత తేలిగ్గా వదిలిపెడుతుందని ఎవరూ ఊహించలేదు. మోదీ, అమిత్ షా మౌనం వెనక ఏదో పరమార్థం ఉందనే అందరూ అనుకున్నారు. అనుకున్నంతా అయింది. రాణే అరెస్ట్ కు ప్రతీకారం తీర్చుకోడానికి కేంద్రం ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ ని రంగంలోకి దింపింది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అనిల్ పరబ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై నమోదైన మనీలాండరింగ్ కేసులో.. విచారణకు రావాల్సిందిగా రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ కి నోటీసులిచ్చింది. అయితే కుట్రపూరితంగానే అనిల్ కు ఈ నోటీసులిచ్చారని శివశేన మండిపడుతోంది.

అనిల్ పరబ్ చేసిన తప్పేంటి..?
కేంద్ర మంత్రి నారాయ‌ణ్ రాణే అరెస్ట్ వ్యవహారంలో మంత్రి అనిల్ ప‌ర‌బ్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన‌ట్లు చెబుతున్నారు. లేట్ చేయకుండా వెంటనే నారాయ‌ణ్ రాణేను అరెస్ట్ చేయాల‌ని ఆరోజు మంత్రి అనిల్, ఒక పోలీసు ఆఫీస‌ర్‌ తో మాట్లాడారట. దానికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై న్యాయ‌పోరాటం చేస్తామని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో ఏకంగా అనిల్ కు ఈడీ నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

అసలు అనిల్ దేశ్ ముఖ్ కేసేంటి..?
ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు విచారణలో భాగంగా అనిల్ దేశ్ ముఖ్ మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాంబు బెదిరింపు కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారి పరమ్ బీర్ సింగ్, అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాశారు. ఎన్సీపీ తరపున ఉద్ధవ్ మంత్రి వర్గంలో ఉన్న అనిల్ రాజీనామా చేశారు. పరమ్ బీర్ ఆరోపణలతో అనిల్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసులో ఇప్పటి వరకూ ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. ఈ దశలో.. అనిల్ దేశ్ ముఖ్ కేసుని అడ్డు పెట్టుకుని, అప్పటి మంత్రి వర్గ సహచరుడు, ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ కి ఈడీ నోటీసులిచ్చింది. నారాయణ్ రాణే అరెస్ట్ నేపథ్యంలో.. ఇదంతా కుట్ర ప్రకారమే జరుగుతోందని శివసేన ఆరోపిస్తోంది. తమకి నచ్చనివారిపై, తమని ఎదిరించినవారిపై కేంద్రం సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందని అంటున్నారు శివసేన నేతలు.

First Published:  30 Aug 2021 4:16 AM IST
Next Story