ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం షాక్..
కరోనా కష్టకాలంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఆల్ పాస్ అంటూ అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. తెలంగాణలో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ కి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు కానీ చిన్న మెలిక పెట్టారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ తరగతులు మొదలైనా.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయకుండా ఎవరినీ పాస్ […]
కరోనా కష్టకాలంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఆల్ పాస్ అంటూ అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. తెలంగాణలో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ కి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు కానీ చిన్న మెలిక పెట్టారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ తరగతులు మొదలైనా.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయకుండా ఎవరినీ పాస్ చేయబోమని, విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనని స్పష్టం చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
సెప్టెంబర్-1 నుంచి తెలంగామలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన తర్వాత పరిస్థితిని సమీక్షించి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆమె తెలిపారు. గత మే నెలలోనే ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనా వల్ల వాటిని వాయిదా వేసి సుమారు 4.35 లక్షలమందిని సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేశారు. దీంతో వారంతా పరీక్షలు లేకుండానే పాసయ్యామన్న సంతోషంలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్ సిలబస్ ని పక్కనపెట్టేశారు, సెకండ్ ఇయర్ పాఠాలతో కుస్తీ పడుతున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో ప్రస్తుతం సెకండియర్ లోని విద్యార్థులందరికీ ఫస్ట్ ఇయర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి సబిత. కరోనా వల్ల గతంలో సెకండ్ ఇయర్ విద్యార్థులను ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా పాస్ చేశామని, మళ్లీ కరోనా విజృంభిస్తే, సెకండ్ ఇయర్ వారిని పాస్ చేసేందుకు ఫస్ట్ ఇయర్ మార్కులేవీ ఉండవు కనుక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు గతంలోనే పరీక్ష ఫీజులు చెల్లించడంతో ఇప్పుడు ఎలాంటి ఫీజులు వసూలుచేయబోమని చెప్పారు. ప్రశ్నా పత్రాలు సిద్ధంగా ఉన్నాయని, పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇస్తామని చెప్పారు.
పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు డైలమాలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పరీక్షలు లేవన్న కారణంగా పుస్తకాలు గిరాటేశారు. సెకండ్ ఇయర్ బుక్స్ తీశారు. ఈ క్రమంలో మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షలంటే తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. తల్లిదండ్రలు కూడా ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. మరి వీరి అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.