Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా పూర్తిచేసిన శౌర్య

నాగశౌర్య కెరీర్ లో 20వ చిత్రం లక్ష్య. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలైన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నాడు. కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ సీన్‌ గురించి వింటున్నాడు నాగశౌర్య. ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు […]

మరో సినిమా పూర్తిచేసిన శౌర్య
X

నాగశౌర్య కెరీర్ లో 20వ చిత్రం లక్ష్య. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలైన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నాడు. కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ సీన్‌ గురించి వింటున్నాడు నాగశౌర్య. ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

భారతదేశ ప్రాచీన విద్య ఆర్చరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో,
ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో
ఆకట్టుకోబోతున్నాడు నాగశౌర్య. రెండింటిమధ్య వేరియేషన్‌ చూపించడానికి చాలా కష్టపడ్డాడట.

ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ సాధించడంతో పాటు.. ఆర్చరీలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు శౌర్య. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూరు రామ్మోహన్‌, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ల మీద తెరకెక్కుతోంది లక్ష్య.

First Published:  30 Aug 2021 3:31 PM IST
Next Story