కిరణ్ అబ్బవరం ఫుల్ హ్యాపీ
మొదటి సినిమాతో హిట్ టాక్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. కానీ ఆ సినిమాతో కలెక్షన్లు మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు రెండో సినిమాతో రెండూ ఒకేసారి అందుకున్నాడు ఈ నటుడు. సెకెండ్ వేవ్ తర్వాత హిట్టయిన తొలి సినిమాగా గుర్తింపు పొందింది ఎస్ఆర్ కళ్యాణమండపం. ఈ సినిమాతో అటు సక్సెస్ తో పాటు ఇటు వసూళ్లు కూడా అందుకున్నాడు. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు రిలీజ్ కు ముందు నుంచే బజ్ వచ్చింది. […]
మొదటి సినిమాతో హిట్ టాక్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. కానీ ఆ సినిమాతో కలెక్షన్లు మాత్రం
అందుకోలేకపోయాడు. ఇప్పుడు రెండో సినిమాతో రెండూ ఒకేసారి అందుకున్నాడు ఈ నటుడు. సెకెండ్ వేవ్ తర్వాత హిట్టయిన తొలి సినిమాగా గుర్తింపు పొందింది ఎస్ఆర్ కళ్యాణమండపం. ఈ సినిమాతో అటు సక్సెస్ తో పాటు ఇటు వసూళ్లు కూడా అందుకున్నాడు.
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు
రిలీజ్ కు ముందు నుంచే బజ్ వచ్చింది. సినిమా టీజర్ హిట్టవ్వడంతో పాటు పాటలకు మంచి రెస్పాన్స్
రావడంతో మూవీ కోసం యూత్ ఎదురుచూశారు. అందరి అంచనాలకు తగ్గట్టు సినిమాలో కంటెంట్
ఉండడంతో ఆటోమేటిగ్గా విజయం సొంతమైంది.
ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకోవడమే కాదు, ఎన్నో విధాలుగా కిరణ్ అబ్బవరంకు నమ్మకం
కలిగించింది ఎస్ఆర్ కళ్యాణమండపం. ఎందుకంటే, ఈ సినిమాకు అన్నీ తానై నడిపించాడు కిరణ్.
నిర్మాతలు ఉన్నప్పటికీ తనే ప్రొడక్షన్ బాధ్యత తీసుకున్నాడు. దర్శకుడు ఉన్నప్పటికీ కథ తనే సెట్
చేసుకున్నాడు. ప్రచార బాధ్యతను కూడా తనే భుజాన మోశాడు.
అందుకే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కిరణ్ కు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత చొరవతో సినిమాలు చేయబోతున్నాడు ఈ హీరో. త్వరలోనే సెబాస్టియన్, సమ్మతమే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో.