Telugu Global
NEWS

వివాదాలకు చెక్.. తిరుమలలో సంప్రదాయ భోజనానికి ఫుల్ స్టాప్..

తిరుమ‌లలో శ్రీ‌వారి భ‌క్తుల కోసం అందిస్తున్న సంప్రదాయ భోజ‌నాన్ని టీడీపీ నిలిపివేసింది. ప్రయోగాత్మకంగా ఈనెల 26నుంచి అన్నమయ్య భ‌వ‌నంలో దీన్ని అందిస్తున్నారు. దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, ప‌ప్పు దినుసుల‌తో త‌యారు చేసిన అల్పాహ‌రం, భోజ‌నం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్ట్ టు కాస్ట్ పద్దతిలో టీటీడీ భక్తులకు అందిస్తోంది. ఇది ఉచితం కాదు. అలాగని లాభాపేక్షతో చేసిన కార్యక్రమం కూడా కాదు. కానీ డబ్బులు తీసుకోవడం, అది కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరగడంతో వివాదం మొదలైంది. […]

వివాదాలకు చెక్.. తిరుమలలో సంప్రదాయ భోజనానికి ఫుల్ స్టాప్..
X

తిరుమ‌లలో శ్రీ‌వారి భ‌క్తుల కోసం అందిస్తున్న సంప్రదాయ భోజ‌నాన్ని టీడీపీ నిలిపివేసింది. ప్రయోగాత్మకంగా ఈనెల 26నుంచి అన్నమయ్య భ‌వ‌నంలో దీన్ని అందిస్తున్నారు. దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, ప‌ప్పు దినుసుల‌తో త‌యారు చేసిన అల్పాహ‌రం, భోజ‌నం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్ట్ టు కాస్ట్ పద్దతిలో టీటీడీ భక్తులకు అందిస్తోంది. ఇది ఉచితం కాదు. అలాగని లాభాపేక్షతో చేసిన కార్యక్రమం కూడా కాదు. కానీ డబ్బులు తీసుకోవడం, అది కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరగడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్ 8వరకు ప్రయోగాత్మకంగా దీన్ని కొనసాగించాల్సి ఉన్నా, వివాదాలు ముసురుకోవడంతో వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

సంప్రదాయ భోజనాన్ని తక్షణం ఆపేస్తున్నట్టు టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలక మండలి అమలులో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని.. కొండపై అన్నప్రసాదాన్ని ఉచితంగానే అందించాలి తప్ప, డబ్బులు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన చెప్పారు. సంప్రదాయ భోజనంలో భాగంగా రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నప్పటికీ.. డబ్బులు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని అంటున్న వైవీ సుబ్బారెడ్డి తక్షణం ఆ కార్యక్రమాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు.

పలమనేరులో 450 ఎకరాల్లో టీటీడీకి ఉన్న గోశాలలో సంప్రదాయ పద్ధతుల్లో గోవుల ఆధారంగా సేంద్రీయంగా పండించిన ఆహార పదార్థాలతో ఈ భోజనాన్ని సిద్ధం చేసేవారు. కొబ్బరి అన్నం, పులిహోర, బూరెలు, పచ్చిపులుసు, కాలా బాత్ ఉప్మా, బియ్యం ఇడ్లీ, ఎరుపు రంగు బియ్యంతో చేసిన వంటకాలు, కర్రలు-సామలు లాంటి తృణధాన్యాలతో చేసిన వంటకాల్ని భక్తులకు వడ్డిస్తూ వచ్చారు. కొనుగోలు ధరకే భక్తులకు అందజేశారు. కానీ అంతలోనే టీటీడీ విధానంపై వివాదాలు ముసురుకున్నాయి. కొండపై స్వయంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమానికి డబ్బులు వసూలు చేయడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తంచేశారు. పూర్తిగా టీటీడీ ఖర్చుతో భక్తులకు సంప్రదాయ భోజనాన్ని పెట్టే స్థోమత టీటీడీకి ఉన్నా కూడా ఇలా డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదనేది వారి అభియోగం. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ నడిచింది. అయితే ఈ విధానాన్ని సమర్థించుకోకుండా నేరుగా రద్దు చేసి, వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

First Published:  30 Aug 2021 7:42 AM GMT
Next Story