భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది
చిన్న సాంగ్ బిట్ తో సంచలనం సృష్టించింది భీమ్లా నాయక్. ఎక్కడ చూసినా ఇదే పాట, ఇదే రింగ్ టోన్. చివరికి పబ్బుల్లో రీమిక్స్ కూడా అయిపోయింది ఆ చిన్న మ్యూజిక్ బిట్. అంతలా వైరల్ అయిన ఆ పాట ఇప్పుడు ఫుల్ గా విడుదల కాబోతోంది. అవును.. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ గా ఈ టైటిల్ సాంగ్ ను 2వ తేదీన విడుదల చేయబోతున్నారు. పవన్-రానా హీరోలుగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర […]
చిన్న సాంగ్ బిట్ తో సంచలనం సృష్టించింది భీమ్లా నాయక్. ఎక్కడ చూసినా ఇదే పాట, ఇదే రింగ్ టోన్.
చివరికి పబ్బుల్లో రీమిక్స్ కూడా అయిపోయింది ఆ చిన్న మ్యూజిక్ బిట్. అంతలా వైరల్ అయిన ఆ పాట
ఇప్పుడు ఫుల్ గా విడుదల కాబోతోంది. అవును.. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ గా ఈ టైటిల్ సాంగ్ ను 2వ తేదీన విడుదల చేయబోతున్నారు.
పవన్-రానా హీరోలుగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంలో పెద్ద హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది భీమ్లా నాయక్. మలయాళం సినిమాలో ఉన్న ట్రాక్ నే యథాతథంగా తెలుగులో కూడా వాడుకున్నారు. అదే ఇక్కడ కూడా హిట్టయింది.
కాకపోతే 2వ తేదీన రాబోతున్న టైటిల్ సాంగ్ కోసం అదే ట్రాక్ ను రిపీట్ చేశారా లేక కొత్త బాణీతో వస్తున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొంతమంది మాత్రం టీజర్ లో విన్న ట్రాక్ కేవలం థీమ్ సాంగ్ గా ఉండిపోతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తున్నాడు భీమ్లా నాయక్. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.