సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఇలాంటి ఇలాంటి చట్టాలు తీసుకువచ్చారని.. ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చట్టాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష ఏఐడీఎంకే, బీజేపీ కూటమి సభ నుంచి వాకౌట్ చేసింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, చర్చ చేపట్టకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తొందర […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఇలాంటి ఇలాంటి చట్టాలు తీసుకువచ్చారని.. ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చట్టాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష ఏఐడీఎంకే, బీజేపీ కూటమి సభ నుంచి వాకౌట్ చేసింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, చర్చ చేపట్టకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తొందర పాటుతో తీర్మానాన్ని ఆమోదించిందని అన్నాడీఎంకే సభ్యులు ఆరోపించారు.
తీర్మానంతో ఏమవుతుంది..?
పంజాబ్, తమిళనాడు సహా.. మొత్తం ఏడు రాష్ట్రాలు, కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలతో ఫలితం ఉంటుందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఆర్టికల్స్ 256, 257 ప్రకారం కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలు విధిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 254 ప్రకారం కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య వివాదం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటవుతుంది. అయితే కేంద్రాన్ని కాదని రాష్ట్రపతి, రాష్ట్ర చట్టాలకు ఆమోదముద్ర వేస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఇలాంటి తీర్మానాలతో కేంద్రం భయపడి చట్టాలను వెనక్కు తీసుకుంటుందనుకోవడం కూడా అమాయకత్వమే. అదే సమయంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి తమిళనాడు తీసుకున్న నిర్ణయం పరోక్షంగా ఊతమిచ్చిందనేమాట మాత్రం వాస్తవం.
పొగడ్తలు ఇష్టపడని ముఖ్యమంత్రి..
పొగడ్తలంటే ఇష్టపడని మనుషులెవరూ ఉండరు. ముఖ్యంగా రాజకీయ నాయకుల వద్ద ఈ పొగడ్తల అస్త్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం తనకు పొగడ్తలు గిట్టవని చెప్పేశారు. అంతే కాదు, అసెంబ్లీలో ప్రజా సమస్యలు పక్కనపెట్టి, ముఖ్యమంత్రినైన తనను పొగుడుతూ కూర్చునే ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని హితవు పలికారు. ఇకపై కూడా ఇలా చేస్తే చర్యలు తప్పవని సుతి మెత్తగా హెచ్చరించారు. తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే అదే పనిగా స్టాలిన్ ను కీర్తిస్తుండే సరికి ఆయన మధ్యలో జోక్యం చేసుకుని ఇక చాలు ఆపండి అంటూ అడ్డుకట్ట వేశారు. అసెంబ్లీ ఉంది ముఖ్యమంత్రి స్తోత్రాలకోసం కాదని, ప్రజా సమస్యలు చర్చించడానికని చెప్పారు స్టాలిన్.