సీటీమార్ రిలీజ్.. ఈసారి ఫిక్స్
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 3న విడుదల […]
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో
తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్
వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 3న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ మేరకు
డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం అందించారు. అయితే 10వ తేదీన విడుదలవ్వాల్సిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. అదే తేదీకి టక్ జగదీష్ సినిమా ఓటీటీలో వస్తోంది. సో.. వినాయకచవితి ఫెస్టివల్ డేట్ ఊహించని విధంగా ఖాళీ అయింది. దీంతో వెంటనే సీటీమార్ సినిమాను వారం రోజులు వాయిదా వేసి, 10వ తేదీకి షిఫ్ట్ చేశారు. అలా గోపీచంద్ సినిమాకు పండగ డేట్ దొరికేసింది.
సినిమాలో గోపీచంద్ ఆంధ్ర టీమ్ కబడ్డీ కోచ్‌గా, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కీలక పాత్రలు చేశారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.