Telugu Global
NEWS

బుధవారం నుంచి స్కూల్స్.. మంగళవారం కేసు విచారణ..

తెలంగాణలో సెప్టెంబర్-1నుంచి తరగతి గది బోధన మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని, అన్ని జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ పునఃప్రారంభిస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక వేళ స్కూల్స్ లో కోవిడ్ కేసులు వస్తే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ స్కూల్ కి సెలవులు ప్రకటిస్తామన్నారు. హైకోర్టులో పిల్.. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణలో ఇక స్కూల్స్ మొదలవుతాయనుకుంటున్న టైమ్ లో […]

బుధవారం నుంచి స్కూల్స్.. మంగళవారం కేసు విచారణ..
X

తెలంగాణలో సెప్టెంబర్-1నుంచి తరగతి గది బోధన మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని, అన్ని జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ పునఃప్రారంభిస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక వేళ స్కూల్స్ లో కోవిడ్ కేసులు వస్తే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ స్కూల్ కి సెలవులు ప్రకటిస్తామన్నారు.

హైకోర్టులో పిల్..
ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణలో ఇక స్కూల్స్ మొదలవుతాయనుకుంటున్న టైమ్ లో ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సికింద్రాబాద్‌ కు చెందిన ఎం.బాలకృష్ణ అనే టీచర్ ఈ పిల్ దాఖలు చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కరోనా మూడో దశ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని, విద్యార్థులకు ఇంకా వ్యాక్సినేషన్ మొదలు కాని కారణంగా.. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే పాఠశాలలు, కళాశాలు పునఃప్రారంభించడం సరికాదని ఆయన పిల్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని, ప్రత్యక్షబోధన నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టుని కోరారు.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మంగళవారం విచారణకు వస్తుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్ పై విచారణ చేపడుతుంది. సెప్టెంబర్ 1నుంచి స్కూల్స్ మొదలు కావాల్సిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూల్స్ మొదలు కావడం, ఒకటిరెండు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నా కూడా.. విద్యార్థుల హాజరు తగ్గకపోవడం, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తరగతి గది బోధనే బాగుంటుందనే నిర్ణయానికి రావడంతో.. తెలంగాణలో కూడా స్కూల్స్ పునఃప్రాంరభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

First Published:  29 Aug 2021 7:32 AM IST
Next Story