Telugu Global
Cinema & Entertainment

సింధు కోసం చిరు పార్టీ.. కళకళలాడిన మెగా నివాసం

ఒక్కసారిగా చిరంజీవి ఇల్లు కళకళలాడింది. దానికి కారణం పీవీ సింధు ఒలింపిక్ పతకం గెలవడమే. అవును.. సింధు గెలుపును చిరంజీవి సెలబ్రేట్ చేశారు. స్వయంగా సింధును తన ఇంటికి ఆహ్వానించి, తనకు బాగా సన్నిహితులైన కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పీవీ సింధును సన్మానించారు చిరంజీవి. పీవీ సింధు కోసం చిరు ఇచ్చిన పార్టీకి హాజరైన వాళ్లలో సుబ్బరామిరెడ్డి, నాగార్జున, రానా, సుహాసిని, రాధిక ఉన్నారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎప్పట్లానే అల్లు అరవింద్, చరణ్, […]

సింధు కోసం చిరు పార్టీ.. కళకళలాడిన మెగా నివాసం
X

ఒక్కసారిగా చిరంజీవి ఇల్లు కళకళలాడింది. దానికి కారణం పీవీ సింధు ఒలింపిక్ పతకం గెలవడమే. అవును.. సింధు గెలుపును చిరంజీవి సెలబ్రేట్ చేశారు. స్వయంగా సింధును తన ఇంటికి ఆహ్వానించి, తనకు బాగా సన్నిహితులైన కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పీవీ సింధును సన్మానించారు చిరంజీవి.

పీవీ సింధు కోసం చిరు ఇచ్చిన పార్టీకి హాజరైన వాళ్లలో సుబ్బరామిరెడ్డి, నాగార్జున, రానా, సుహాసిని, రాధిక
ఉన్నారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎప్పట్లానే అల్లు అరవింద్, చరణ్, వరుణ్ తేజ్, సాయితేజ్
హాజరయ్యారు. అఖిల్, శర్వానంద్ కూడా ఈ పార్టీకొచ్చి సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా కాంపౌండ్
పెద్ద హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్, ఎప్పట్లానే ఈ పార్టీకి కూడా హాజరుకాలేదు.

పార్టీ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేశారు. వీడియో చూస్తే పార్టీ చాలా సందడిగా జరిగిందనే విషయం తెలుస్తూనే ఉంది. పార్టీలో మాట్లాడిన ప్రముఖులంతా సింధును ఆకాశానికెత్తేశారు. దీంతో పులకించినపోయిన సింధు, వచ్చే ఒలింపిక్స్ లో బంగారు పతకం కొట్టడానికి ప్రయత్నిస్తానని ప్రకటించింది.

First Published:  29 Aug 2021 9:59 AM IST
Next Story