Telugu Global
Cinema & Entertainment

సమంత, నాగచైతన్య విడిపోతున్నారా?

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత. వీళ్లిద్దరి వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై ఎప్పటికప్పుడు పుకార్లు రావడం కొత్తకాదు. అయితే ఈసారి మాత్రం నాగచైతన్య-సమంత వైవాహిక జీవితంపై పుకార్లు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ విడిపోతారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం సమంత. ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి అక్కినేని అనే పదాన్ని తొలిగించింది. ఇదే ఊహాగానాలకు ప్రధాన కారణంగా మారింది. దీనికితోడు తను సినిమాల నుంచి కొన్ని నెలల పాటు […]

సమంత, నాగచైతన్య విడిపోతున్నారా?
X

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత. వీళ్లిద్దరి వ్యక్తిగత జీవితంపై,
సినిమాలపై ఎప్పటికప్పుడు పుకార్లు రావడం కొత్తకాదు. అయితే ఈసారి మాత్రం నాగచైతన్య-సమంత వైవాహిక జీవితంపై పుకార్లు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ విడిపోతారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

ఈ ప్రచారానికి ప్రధాన కారణం సమంత. ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి అక్కినేని అనే పదాన్ని
తొలిగించింది. ఇదే ఊహాగానాలకు ప్రధాన కారణంగా మారింది. దీనికితోడు తను సినిమాల నుంచి కొన్ని
నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని ఆమె ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. ఈ రెండు కారణాల్ని
చూపించి పుకార్లు అల్లేస్తున్నారు చాలామంది.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీనిపై ఇటు సమంత, అటు నాగచైతన్య స్పందించకపోవడం. నాగచైతన్య సోషల్ మీడియాకు దూరం కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ, అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే సమంతకు ఈ పుకార్లు వినిపించే ఉంటాయి. కనీసం ఆమె కూడా వీటిపై స్పందించకపోవడం రూమర్లకు మరింత ఊతమిచ్చినట్టయింది.

కొసమెరుపు ఏంటంటే.. ఓవైపు నాగచైతన్య-సమంత తల్లిదండ్రులుగా మారడం కోసం ప్రయత్నిస్తున్నారంటూ కొందరు రాస్తుంటే, మరికొందరు వీళ్ల విడాకులపై కథనాలు రాస్తున్నారు.

First Published:  28 Aug 2021 10:55 AM IST
Next Story