Telugu Global
National

రాజకీయాల్లో చేరికపై సోనూ సూద్ క్లారిటీ..

లాక్ డౌన్ హీరోగా పేరొందిన సినీ నటుడు సోనూ సూద్ కి ఢిల్లీ ప్రభుత్వం ఓ సరికొత్త బాధ్యతను అప్పగించింది. ఆయన సామాజిక సేవకు తగిన గుర్తింపునిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలసి ‘దేశ్ కే మెంటార్స్’ అనే కార్యక్రమంలో సోనూ భాగస్వామి కాబోతున్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆయనకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు కేజ్రీవాల్. సోనూ సూద్ ని మెంటర్ గా నియమించినందుకు ఢిల్లీ ప్రభుత్వం గర్వపడుతోందని చెప్పారు. ఇది నా బాధ్యత.. […]

రాజకీయాల్లో చేరికపై సోనూ సూద్ క్లారిటీ..
X

లాక్ డౌన్ హీరోగా పేరొందిన సినీ నటుడు సోనూ సూద్ కి ఢిల్లీ ప్రభుత్వం ఓ సరికొత్త బాధ్యతను అప్పగించింది. ఆయన సామాజిక సేవకు తగిన గుర్తింపునిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలసి ‘దేశ్ కే మెంటార్స్’ అనే కార్యక్రమంలో సోనూ భాగస్వామి కాబోతున్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆయనకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు కేజ్రీవాల్. సోనూ సూద్ ని మెంటర్ గా నియమించినందుకు ఢిల్లీ ప్రభుత్వం గర్వపడుతోందని చెప్పారు.

ఇది నా బాధ్యత..
లాక్ డౌన్ సమయంలో తాను చాలామంది విద్యార్థులను కలిశానని, వారి సమస్యలపై తనకు అవగాహన ఉందని, అందుకే ఈ బాధ్యతలను స్వీకరించానని చెప్పారు సోనూ సూద్. లక్షలాది విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని, అది తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. విద్యార్థులతో కలసి పనిచేయడం గొప్ప సేవగా భావిస్తానని అన్నారు.

రాజకీయాల్లో చేరను..
రాజకీయాల్లో చేరేందుకు తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, అయినా తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు సోనూ సూద్. మంచిపని చేయడం కోసం రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. కేజ్రీవాల్ తో జరిగిన సమావేశంలో కూడా రాజకీయాల ప్రస్తావన లేదని చెప్పారు. అయితే ఇటీవల సోనూ సూద్ రాజకీయ రంగప్రవేశంపై చాలా వార్తలొచ్చాయి. గతంలో లాక్ డౌన్ సమయంలో ఆయన సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు కూడా సంబంధం ఉందని అన్నారు. కానీ అప్పుడే వాటిని ఆయన ఖండించారు. ఇటీవల సోనూ సూద్ ముంబై కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున సోనూ పోటీకి దిగుతారని, ఈమేరకు పార్టీ అభిప్రాయ సేకరణ చేపట్టినట్టు వార్తలొచ్చాయి. సోనూ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు కేజ్రీవాల్ తో సమావేశం కావడం, ఢిల్లీ ప్రభుత్వం తరపున మెంటర్ గా ఉండటం చూస్తుంటే.. ఆయన రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తారనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే అదే ప్రెస్ మీట్ లో సోనూ సూద్ ఆ వార్తలను ఖండించారు. కేజ్రీవాల్ తో రాజకీయ పరమైన చర్చలు జరగలేదన్నారు. తనకు వివిధ పార్టీలనుంచి ఆఫర్లు వచ్చాయని అయినా కూడా తాను పాలిటిక్స్ లోకి రావట్లేదని స్పష్టం చేశారు.

First Published:  27 Aug 2021 8:58 AM IST
Next Story