Telugu Global
National

టీకా తీసుకోకపోతే రేషన్ కట్..

టీకాతోనే కరోనా కట్టడి సాధ్యం అని భావిస్తున్న ఈ తరుణంలో చాలామందికి ఇంకా వ్యాక్సినేషన్ పై అవగాహన లేదు. తొలిడోసు తీసుకున్న చాలామంది, వ్యవధి మీరిపోయినా రెండో డోసుకి రావడంలేదు. మరోవైపు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో కోవిడ్ టీకాలు తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఈ దశలో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు టీకాలు తీసుకున్నవారికి రాయితీలు ఇస్తుంటే.. ప్రభుత్వం మాత్రం టీకా తీసుకోకపోతే రేషన్ […]

టీకా తీసుకోకపోతే రేషన్ కట్..
X

టీకాతోనే కరోనా కట్టడి సాధ్యం అని భావిస్తున్న ఈ తరుణంలో చాలామందికి ఇంకా వ్యాక్సినేషన్ పై అవగాహన లేదు. తొలిడోసు తీసుకున్న చాలామంది, వ్యవధి మీరిపోయినా రెండో డోసుకి రావడంలేదు. మరోవైపు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో కోవిడ్ టీకాలు తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఈ దశలో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు టీకాలు తీసుకున్నవారికి రాయితీలు ఇస్తుంటే.. ప్రభుత్వం మాత్రం టీకా తీసుకోకపోతే రేషన్ కట్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది.

కోవిడ్‌ టీకా వేసుకోని వారికి రేషన్‌ పంపిణీ ఆపేస్తామని హెచ్చరించింది కర్నాటక ప్రభుత్వం. వ్యాక్సిన్‌ వేసుకోని కార్డు దారులకు రేషన్‌ ఇవ్వబోమంటూ బోర్డులు ప్రదర్శించాలని తహశీల్దార్లకు ఆదేశాలిచ్చింది. రేషన్‌ తీసుకోడానికి వచ్చేవారు టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ కానీ, మొబైల్ కి వచ్చిన మెసేజ్‌ కానీ చూపించాలని చెప్పింది. అలా చూపించినవారికే రేషన్ సరకులు పంపిణీ చేయాలని చెప్పింది. ఈ నిబంధనతో అయినా అందరూ తప్పనిసరిగా టీకా తీసుకుంటారని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మూడో దశ రాకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమని అంటున్న కర్నాటక సర్కారు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

సంచార టీకా..
గ్రామీణ ప్రాంతాల్లో టీకా వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై. బెంగళూరులో ఆయన టీకా వాహనాలను ప్రారంభించారు. వినాయక చవితిని ఘనంగా నిర్వహించాలన్న డిమాండ్లపై సీఎం స్పందించక పోవడం విశేషం. ఇప్పటికే పండగలు, పబ్బాల పేరుతో కేరళ కొవిడ్ ను నిర్లక్ష్యం చేసి ప్రతిఫలం అనుభవిస్తోంది. ఈ దశలో కర్నాటకలో వినాయక చవితికి ప్రత్యేక అనుమతులిస్తే కేసుల సంఖ్య పెరగడం ఖాయమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీలైనంత వరకు అందరికీ త్వరగా టీకా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉంది.

First Published:  27 Aug 2021 5:08 AM IST
Next Story