సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత
కొన్నాళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది సమంత. అంతే.. ఆ వెంటనే ఆమెపై, ఆమె కెరీర్ పై పుకార్లు ప్రారంభమయ్యాయి. తల్లి కావడం కోసమే సమంత గ్యాప్ తీసుకుంటోందని కొందరు అంటే.. ఏకంగా సినిమాలు ఆపేస్తోందని మరికొందరు పుకార్లు పుట్టించారు. దీంతో మరోసారి ఈ అంశంపై ప్రకటన చేసింది సమంత. తను కొన్ని నెలల పాటు మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నానని స్పష్టంచేసింది సమంత. గ్యాప్ తర్వాత కచ్చితంగా మళ్లీ సినిమాల్లోకి వస్తానని, నటన నుంచి […]
కొన్నాళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది సమంత. అంతే.. ఆ వెంటనే ఆమెపై, ఆమె కెరీర్ పై పుకార్లు ప్రారంభమయ్యాయి. తల్లి కావడం కోసమే సమంత గ్యాప్ తీసుకుంటోందని కొందరు అంటే.. ఏకంగా సినిమాలు ఆపేస్తోందని మరికొందరు పుకార్లు పుట్టించారు. దీంతో మరోసారి ఈ అంశంపై ప్రకటన చేసింది సమంత.
తను కొన్ని నెలల పాటు మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నానని స్పష్టంచేసింది సమంత. గ్యాప్ తర్వాత కచ్చితంగా మళ్లీ సినిమాల్లోకి వస్తానని, నటన నుంచి తప్పుకునేది లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంతా తన 2.O వెర్షన్ చూస్తున్నారని.. త్వరలోనే 3.O వెర్షన్ చూపిస్తానని కూడా ప్రకటించింది ఈ అక్కినేని కోడలు పిల్ల.
ప్రస్తుతం శాకుంతలం సినిమాను పూర్తిచేసిన సమంత.. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. అది పూర్తయిన తర్వాత ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం కాబోతోంది. ఈ గ్యాప్ లో కనీసం కథలు కూడా వినేది లేదని ఆమె తెగేసి చెప్పేసింది.