Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ తో హీరోల బంధం తెగిపోయింది

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఉన్న బంధం తెగిపోయింది. అవును.. ఇక ఈ సినిమాలకు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఈ ఇద్దరు హీరోలు ప్యాకప్ చెప్పేశారు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్-ఎన్టీఆర్ పై ఆఖరి షాట్ ను పిక్చరైజ్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ షాట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాకు […]

ఆర్ఆర్ఆర్ తో హీరోల బంధం తెగిపోయింది
X

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఉన్న బంధం తెగిపోయింది. అవును.. ఇక ఈ సినిమాలకు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఈ ఇద్దరు హీరోలు ప్యాకప్ చెప్పేశారు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్-ఎన్టీఆర్ పై ఆఖరి షాట్ ను పిక్చరైజ్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ షాట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఈ ఇద్దరు హీరోల పోర్షన్ పూర్తిగా కంప్లీట్ అయింది.

అయితే హీరోల పోర్షన్ కంప్లీట్ అయినప్పటికీ.. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. టోటల్ గా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయలేదు. 3 స్టుడియోస్ లో వేసిన డిఫరెంట్ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు రాజమౌళి. మరో 10 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ పై రాజమౌళి ప్రకటన చేయబోతున్నాడు.

First Published:  26 Aug 2021 3:21 PM IST
Next Story