Telugu Global
Cinema & Entertainment

గ్యాప్ తీసుకుంటున్న అక్కినేని కోడలు

అక్కినేని కోడలు సమంత గ్యాప్ తీసుకుంటోంది. సినిమాలకు కొన్నాళ్ల పాటు విరామం ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంతానే ప్రకటించింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టిన సమంత.. తను ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. “ప్రస్తుతం నా చేతిలో ఏ సినిమా లేదు. శాకుంతలం సినిమాను కూడా పూర్తిచేశాను. కొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త కథలు వింటాను. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-కె, పవన్ […]

గ్యాప్ తీసుకుంటున్న అక్కినేని కోడలు
X

అక్కినేని కోడలు సమంత గ్యాప్ తీసుకుంటోంది. సినిమాలకు కొన్నాళ్ల పాటు విరామం ఇవ్వబోతోంది. ఈ
విషయాన్ని స్వయంగా సమంతానే ప్రకటించింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ
విషయాన్ని బయటపెట్టిన సమంత.. తను ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాననే విషయాన్ని మాత్రం
వెల్లడించలేదు.

“ప్రస్తుతం నా చేతిలో ఏ సినిమా లేదు. శాకుంతలం సినిమాను కూడా పూర్తిచేశాను. కొన్నాళ్లు గ్యాప్
తీసుకోవాలనుకుంటున్నాను. గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త కథలు వింటాను. ప్రభాస్ నటిస్తున్న
ప్రాజెక్ట్-కె, పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమాల్లో నేను లేను. అవి గాసిప్స్ మాత్రమే.”

ఇలా తన కెరీర్ కు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతి హీరోగా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. మరో 10 రోజుల్లో ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక గ్యాప్ తీసుకొని సమంత ఏం చేయబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  25 Aug 2021 12:37 PM IST
Next Story