శరీరం కాదు, మనసును సిద్ధం చేస్తుందట
కీర్తిసురేష్ లో ఎంత టాలెంట్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పాత్రల కోసం ఎలా ప్రిపేర్ అవుతుంది. ఇదే ప్రశ్న కీర్తిసురేష్ కు ఎదురైంది. దీనికి ఆమె భిన్నమైన సమాధానం ఇచ్చింది. కొత్త పాత్రలు అనగానే చాలామంది మేకోవర్ అయిపోతుంటారు. రకరకాలుగా ముఖాన్ని, శరీరాన్ని మార్చేసుకుంటారు. కానీ తను మాత్రం పాత్ర కోసం మానసికంగా సిద్ధమౌతానంటోంది కీర్తిసురేష్. ఓ క్యారెక్టర్ కు ఒప్పుకున్న […]
కీర్తిసురేష్ లో ఎంత టాలెంట్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పాత్రల కోసం ఎలా ప్రిపేర్ అవుతుంది. ఇదే ప్రశ్న కీర్తిసురేష్ కు ఎదురైంది. దీనికి ఆమె భిన్నమైన సమాధానం ఇచ్చింది.
కొత్త పాత్రలు అనగానే చాలామంది మేకోవర్ అయిపోతుంటారు. రకరకాలుగా ముఖాన్ని, శరీరాన్ని
మార్చేసుకుంటారు. కానీ తను మాత్రం పాత్ర కోసం మానసికంగా సిద్ధమౌతానంటోంది కీర్తిసురేష్. ఓ క్యారెక్టర్ కు ఒప్పుకున్న తర్వాత, ఆ పాత్ర కోసం తన మనసు స్ట్రగుల్ అవుతుందని, అలా సెట్స్ పైకి వచ్చేసరికి క్యారెక్టర్ కోసం పూర్తిస్థాయిలో మానసికంగా సిద్ధమౌతానని అంటోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమె ఇదే పద్ధతి ఫాలో అవుతోందట.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సర్కారువారి పాట, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తోంది. సర్కారువారి పాట సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా.. భోళాశంకర్ లో చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది కీర్తిసురేష్. ఈ రెండు సినిమాలకు తనకు మరింత పేరు తెచ్చిపెడతాయని నమ్మకంగా చెబుతోంది.