Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ సీటీమార్ కూడా అప్పుడే

సెప్టెంబర్ 3పై ఆల్రెడీ చాలా ఒత్తిడి ఉంది. ఆ తేదీకి ఇప్పటికే నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమా లాక్ అయింది. దీంతో పాటు డియర్ మేఘ అనే సినిమా కూడా ఉంది. రేపోమాపో కిల్లర్ అనే మరో చిన్న సినిమాను కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ పక్కనపెట్టేలా వచ్చింది సీటీమార్ సినిమా. అవును.. అన్ని చిన్న సినిమాలకు గండికొడుతూ.. సెప్టెంబర్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో […]

గోపీచంద్ సీటీమార్ కూడా అప్పుడే
X

సెప్టెంబర్ 3పై ఆల్రెడీ చాలా ఒత్తిడి ఉంది. ఆ తేదీకి ఇప్పటికే నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమా లాక్ అయింది. దీంతో పాటు డియర్ మేఘ అనే సినిమా కూడా ఉంది. రేపోమాపో కిల్లర్ అనే మరో చిన్న సినిమాను కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ పక్కనపెట్టేలా వచ్చింది సీటీమార్ సినిమా. అవును.. అన్ని చిన్న సినిమాలకు గండికొడుతూ.. సెప్టెంబర్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో
తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్
వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు.

సినిమాలో గోపీచంద్‌ ఆంధ్ర టీమ్ క‌బ‌డ్డీ కోచ్‌గా, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టించారు. ఇద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌ల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు
హైలెట్స్ అని చెబుతున్నారు.

First Published:  24 Aug 2021 3:33 PM IST
Next Story