Telugu Global
Cinema & Entertainment

జక్కన్నను ఏడిపించిన చరణ్-తారక్

సెట్స్ లో హీరోల్ని ఏడిపించడం రాజమౌళి స్టయిల్. పెర్ఫెక్షన్ కోసం రోజుల తరబడి హీరోలతో తీసిన సన్నివేశాల్నే తీస్తుంటాడు. అందుకే రాజమౌళికి జక్కన్న అనే బిరుదు కూడా వచ్చింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా ఇలానే రామ్ చరణ్, ఎన్టీఆర్ ను తెగ కష్టపెడుతున్నాడు జక్కన్న. అలా సెట్స్ లో రాజమౌళితో ఇబ్బందులు పడుతున్న ఈ హీరోలకు ఎట్టకేలకు, రాజమౌళిపైనే జోకులు వేసే సందర్భం దొరికింది. దీంతో ఇద్దరూ రెచ్చిపోయారు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే […]

జక్కన్నను ఏడిపించిన చరణ్-తారక్
X

సెట్స్ లో హీరోల్ని ఏడిపించడం రాజమౌళి స్టయిల్. పెర్ఫెక్షన్ కోసం రోజుల తరబడి హీరోలతో తీసిన
సన్నివేశాల్నే తీస్తుంటాడు. అందుకే రాజమౌళికి జక్కన్న అనే బిరుదు కూడా వచ్చింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా ఇలానే రామ్ చరణ్, ఎన్టీఆర్ ను తెగ కష్టపెడుతున్నాడు జక్కన్న. అలా సెట్స్ లో రాజమౌళితో ఇబ్బందులు పడుతున్న ఈ హీరోలకు ఎట్టకేలకు, రాజమౌళిపైనే జోకులు వేసే సందర్భం దొరికింది. దీంతో ఇద్దరూ రెచ్చిపోయారు.

ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నాడు. దీనికి తారక్ హోస్ట్ అనే విషయం
అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో జక్కన్న ప్రస్తావన వచ్చింది. దీంతో రాజమౌళిపై ఇద్దరు హీరోలు ఓ
రేంజ్ లో సెటైర్లు వేశారు. జుట్టు పెరిగిందేంటి, గడ్డం తగ్గిందేంటి అని రాజమౌళి అడిగినప్పుడు.. మూడేళ్ల
పాటు ఒకే సినిమా తీస్తే జుట్టు, గడ్డం పెరగవా అంటూ సెటైర్లు వేశారు హీరోలు.

ఇలా రాజమౌళిపై జోకులు వేసినప్పటికీ.. పెర్ఫెక్షన్ విషయంలో అతడ్ని మించినోడు లేడంటున్నారు ఈ
హీరోలు. ఓ సీన్ కు సంబంధించి ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నప్పటికీ, దానికి 10 రెట్లు బెటర్ గా ఔట్ పుట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతాడని
చెబుతున్నారు ఈ హీరోలిద్దరు.

First Published:  24 Aug 2021 3:26 PM IST
Next Story