Telugu Global
Cinema & Entertainment

యాక్టర్ కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? వివరాలు చెప్పిన హీరో

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కార్తికేయ గుమ్ముకొండ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు అవుతున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో అతడికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. బంధువులు, స్నేహితులు, ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దల మధ్యన కార్తికేయ నిశ్చితార్దం ఘనంగా జరిగింది. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కార్తికేయ.. ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా భారీ ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా […]

యాక్టర్ కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? వివరాలు చెప్పిన హీరో
X

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కార్తికేయ గుమ్ముకొండ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు అవుతున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో అతడికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. బంధువులు, స్నేహితులు, ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దల మధ్యన కార్తికేయ నిశ్చితార్దం ఘనంగా జరిగింది. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కార్తికేయ.. ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా భారీ ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేస్తానంటూ ముందుకు వచ్చాడు. కార్తికేయ ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు అజిత్ నటిస్తున్న తమిళ సినిమా ‘వాలిమై’లో విలన్ రోల్ పోషిస్తున్నాడు.

కాగా, కార్తికేయ నిశ్చితార్దం అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అతడు చేసుకోబోయే ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇండస్ట్రీతో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఒకరు అంటే.. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురంటూ మరొకరు వార్తలు పుట్టించారు. వాటిన్నింటికీ చెక్ పెడుతూ కార్తికేయ స్వయంగా తన కాబోయే జీవిత సహచరి ఎవరో వెల్లడించారు. ‘నా నిశ్చితార్దపు సమాచారాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. నా ఎంగేజ్‌మెంట్ నా బెస్ట్ ఫ్రెండ్ లోహితతో జరిగింది. ఆమెకు, నాకు 2010 నుంచి పరిచయం. వరంగల్ ఎన్ఐటీలో మేము తొలిసారిగా కలుసుకున్నాము’ అంటూ సోషల్ మీడియాలో కార్తికేయా ఆమె గురించిన వివరాలు చెప్పాడు.

గత దశాబ్ద కాలంగా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాము. ఇంకా ఎన్నో దశాబ్దాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని కార్తికేయ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. కాగా, కార్తికేయ ఇన్నాళ్లుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం దగ్గరి స్నేహితులకు తప్ప ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.

First Published:  24 Aug 2021 2:11 AM IST
Next Story