Telugu Global
NEWS

ఇక ఇంటింటికీ టీకా.. 24గంటలూ టీకా..

వ్యాక్సిన్ల కొరత అనే వ్యవహారం కొన్నిరోజులుగా సద్దుమణగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద అందుబాటులో ఉన్న టీకాలను ఎంత సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నామనే విషయంపై దృష్టిపెట్టాయి. పలు రాష్ట్రాలు వినూత్నంగా ఆలోచిస్తూ టీకా పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. తెలంగాణలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అమలు చేస్తున్నారు. కాల‌నీలు, బ‌స్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహ‌నాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించబోతున్నారు. […]

ఇక ఇంటింటికీ టీకా.. 24గంటలూ టీకా..
X

వ్యాక్సిన్ల కొరత అనే వ్యవహారం కొన్నిరోజులుగా సద్దుమణగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద అందుబాటులో ఉన్న టీకాలను ఎంత సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నామనే విషయంపై దృష్టిపెట్టాయి. పలు రాష్ట్రాలు వినూత్నంగా ఆలోచిస్తూ టీకా పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. తెలంగాణలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అమలు చేస్తున్నారు. కాల‌నీలు, బ‌స్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహ‌నాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించబోతున్నారు. ఈ రోజునుంచి మొదలయ్యే ఈ సంచార టీకా కార్యక్రమం 10 రోజుల‌పాటు జరుగుతుంది. ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని అంటున్నారు అధికారులు. కాల‌నీల‌లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోనివారి జాబితాను సేక‌రిస్తున్నారు వైద్య సిబ్బంది.

తమిళనాడులో 24గంటలూ టీకా..
తమిళనాడు ప్రజలకు 24 గంటలపాటు కరోనా టీకా కేంద్రాలను తెరచే ఉంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజునుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. 37 జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీల్లో 24 గంటల పాటు కరోనా టీకా వేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉద్యోగం, ఇతర పనుల నేపథ్యంలో టీకా తీసుకునేందుకు తగిన సమయం లేని వారికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు దీనిని వినియోగించుకోవచ్చని తెలిపారు.

వృద్ధులకోసం ఇంటింటికీ టీకా..
24గంటల టీకా కేంద్రాలతోపాటు, ఇంటింటికీ టీకా కార్యక్రమాన్ని కూడా తమిళనాడు అమలు చేయబోతోంది. అయితే ఇది కేవలం వృద్ధులకు మాత్రమే. వృద్ధులు టీకా కేంద్రాల వద్దకు రాలేకపోతున్నారని, వచ్చినా ఎక్కువ సమయం వేచి చూసేందుకు వారి ఆరోగ్యం సహకరించడంలేదని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా గ్రేటర్ చెన్నై పరిధిలో దీన్ని అమలు చేస్తారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది టీకా వేస్తారు.

First Published:  22 Aug 2021 9:51 PM GMT
Next Story