సోదరిని వేధించిన వ్యక్తిని దారుణంగా హింసించిన మైనర్లు
మైనర్ బాలికకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్న ఒక వ్యక్తిని.. బాలిక సోదరుడు, అతని స్నేహితులు కలసి దారుణంగా దాడి చేసిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళకు చెందిన సల్మానుల్ ఫారీస్ (23) అనే వ్యక్తిని ఏడుగురు మైనర్లు కలసి దాడి చేశారు. వారు సదరు వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళకు చెందిన […]
మైనర్ బాలికకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్న ఒక వ్యక్తిని.. బాలిక సోదరుడు, అతని స్నేహితులు కలసి దారుణంగా దాడి చేసిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళకు చెందిన సల్మానుల్ ఫారీస్ (23) అనే వ్యక్తిని ఏడుగురు మైనర్లు కలసి దాడి చేశారు. వారు సదరు వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళకు చెందిన సల్మానుల్ ఒక 13 ఏళ్ల బాలికకు అసభ్యకరంగా సందేశాలు పంపుతున్నాడు. ఆ సందేశాలను చూసిన బాలిక విషయాన్ని తండ్రికి చెప్పింది. అయితే తండ్రి ఆమెనే మందలించి ఫోన్ తీసుకున్నాడు. అయితే ఈ విషయం బాలిక అన్నకు తెలిసింది. హయ్యర్ సెకండరీ చదువుతున్న బాలిక అన్నయ్య.. అతడి స్నేహితులు కలసి అగస్టు 17న సల్మానుల్ ఫారిస్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడితో పాటు దాడి చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశారు.
దాడి చేసిన వాళ్లందరూ మైనర్లు కావడంతో వారితో పాటు వారి తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జువైలెన్ జస్టీస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింది కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.