Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్ 2 కొత్త విడుదల తేదీ ఇదే

సెకెండ్ వేవ్ కారణంగా కేజీఎఫ్ 2 కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం ఈ సినిమా గత నెలలో విడుదల కావాలి. కానీ అలా జరగలేదు. అప్పట్నుంచి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఎట్టకేలకు కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 14న కేజీఎఫ్2 థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మరో కొత్త పోస్టర్ విడుదల చేసి మరీ తేదీని ప్రకటించారు. […]

కేజీఎఫ్ 2 కొత్త విడుదల తేదీ ఇదే
X

సెకెండ్ వేవ్ కారణంగా కేజీఎఫ్ 2 కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం ఈ సినిమా గత
నెలలో విడుదల కావాలి. కానీ అలా జరగలేదు. అప్పట్నుంచి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్
వెయిటింగ్. ఎట్టకేలకు కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా
ఏప్రిల్ 14న కేజీఎఫ్2 థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మరో కొత్త పోస్టర్ విడుదల చేసి మరీ తేదీని ప్రకటించారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. టీజ‌ర్‌లో చూపించిన‌ట్లు ఓ భారీ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని నిల‌బ‌డిన య‌ష్‌, హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌, రిమికా సేన్ అనే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మ‌రో బాలీవుడ్ స్టార్ ర‌వీనాటాండ‌న్‌, ప్రకాశ్ రాజ్‌, రావు ర‌మేశ్‌, స‌హా చిత్రంలోని ఇత‌ర తారాగ‌ణం వారి వారి డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో క‌నిపిస్తున్నారు. అయితే ప్ర‌ధానంగా పోస్ట‌ర్‌లో చంటిపిల్లాడిని ప‌ట్టుకుని బాధ‌తో గుండెల‌కు హ‌త్తుకున్న అమ్మను కూడా చూడొచ్చు. ఇది సినిమాలోని ఎమోష‌న‌ల్ యాంగిల్ అయిన మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేస్తుంది.

కేజీఎఫ్2 విడుదల తేదీతో ఆర్ఆర్ఆర్ కు మరోసారి చిక్కొచ్చి పడింది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల
కావట్లేదనే విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. దీనికి సంబంధించి త్వరలోనే రాజమౌళి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలని అనుకున్నాడట జక్కన్న. కానీ అంతలోనే కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సో.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆర్ఆర్ఆర్ రాదనేది పక్కా. ఇక మిగిలింది మే నెల మాత్రమే.

First Published:  23 Aug 2021 2:46 AM IST
Next Story