చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్
చిరంజీవికి కీర్తిసురేష్ రాఖీ కట్టింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికేం లేదు. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఆ విషయాన్ని ఇలా రాఖీ కట్టే వీడియో ద్వారా వెల్లడించారు. వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది భోళా శంకర్. ఇందులో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఈ పాత్ర కోసం చాలామందిని అనుకున్నారు. ఫైనల్ గా కీర్తిసురేష్ ను ఒప్పించగలిగాడు దర్శకుడు మెహర్ రమేష్. ఈ రోల్ కోసం కీర్తిసురేష్ కు ఏకంగా కోటిన్నర రూపాయల […]
చిరంజీవికి కీర్తిసురేష్ రాఖీ కట్టింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికేం
లేదు. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఆ విషయాన్ని ఇలా రాఖీ కట్టే వీడియో ద్వారా వెల్లడించారు.
వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది భోళా శంకర్. ఇందులో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఈ పాత్ర కోసం
చాలామందిని అనుకున్నారు. ఫైనల్ గా కీర్తిసురేష్ ను ఒప్పించగలిగాడు దర్శకుడు మెహర్ రమేష్. ఈ రోల్ కోసం కీర్తిసురేష్ కు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. ఈ విషయాలన్నీ చాన్నాళ్ల కిందటే బయటకొచ్చాయి. తాజాగా కీర్తిసురేష్ ఎంట్రీని అధికారికంగా బయటపెట్టారు.
రక్షా బంధన్ రోజున విడుదలైన ఈ వీడియోకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఆహ్లాదకరమైన
బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను చాలా స్టైలిష్‌గా తెరకెక్కిస్తాడనే పేరున్న
డైరెక్టర్ మెహర్ రమేశ్.. ఈ 'భోళా శంకర్' సినిమాను ప్యామిలీ ఎమోషన్స్‌తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా
తెరకెక్కించబోతున్నారని అర్థమవుతుంది.
చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో ..అనీల్ సుంకర తన ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ అసోషియేషన్‌తో నిర్మిస్తోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు