భోళా శంకర్ గా మారిన చిరంజీవి
చిరంజీవి పుట్టినరోజు హంగామా ఓ రేంజ్ లో నడిచింది. ఓవైపు శుభాకాంక్షలు, మరోవైపు సినిమా అప్ డేట్స్ తో సందడిగా మారింది. ఇందులో భాగంగా చిరంజీవి కొత్త సినిమా సంగతులు వరసగా బయటకొచ్చాయి. మరీ ముఖ్యంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ పెట్టారు. హౌరా బ్రిడ్జ్, కాళీ మాత గుడి బ్యాక్ డ్రాప్ లో టైటిల్ డిజైన్ చేసి వదిలారు. ఈ టైటిల్ పోస్టర్ ను […]
చిరంజీవి పుట్టినరోజు హంగామా ఓ రేంజ్ లో నడిచింది. ఓవైపు శుభాకాంక్షలు, మరోవైపు సినిమా అప్ డేట్స్ తో సందడిగా మారింది. ఇందులో భాగంగా చిరంజీవి కొత్త సినిమా సంగతులు వరసగా బయటకొచ్చాయి. మరీ ముఖ్యంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ పెట్టారు. హౌరా బ్రిడ్జ్, కాళీ మాత గుడి బ్యాక్ డ్రాప్ లో టైటిల్ డిజైన్ చేసి వదిలారు. ఈ టైటిల్ పోస్టర్ ను స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి, చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పాడు.
“హ్యాపీ బర్త్ డే చిరంజీవిగారు. నా స్నేహితుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో, నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర్ నిర్మాతగా రూపొందనున్న మీ 'భోళా శంకర్' సినిమా టైటిల్‌ను విడుదల చేయడమనేది గౌరవంగా భావిస్తున్నాను. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాలతో విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సర్“ అంటూ టైటిల్‌ను విడుదల చేస్తూ మహేశ్ బాబు ట్వీట్ కూడా చేశారు.”
ఇంతకుముందు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రచారానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా
వచ్చారు. ఆ రుణాన్ని మహేష్ బాబు ఇప్పుడిలా తీర్చుకున్నట్టయింది. తమిళ్ లో పెద్ద హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా రాబోతోంది భోళా శంకర్. 2022లో ఈ సినిమాను విడుదల చేస్తారు.