Telugu Global
Cinema & Entertainment

తెరిచిన థియేటర్లు మూసేయకు సంపూ!

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. చిన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి. తామరతంపరగా వారానికి అరడజను సినిమాలు చొప్పున వస్తూనే ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజరాజ చోర సినిమాలు మినహా చెప్పుకోదగ్గవేం లేవు. అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నవే. వాటిపై ప్రేక్షకుల్లో ఎవ్వరికీ పెద్దగా కంప్లయింట్స్ లేవు. ఒక్క సంపూర్నేష్ బాబు పై తప్ప! తాజాగా సంపూ నటించిన బజార్ రౌడీ అనే సినిమా వచ్చింది. సంపూర్ణేష్ బాబు పేరు చెప్పగానే ఎవరికైనా కామెడీ గుర్తొస్తుంది. అందుకే […]

తెరిచిన థియేటర్లు మూసేయకు సంపూ!
X

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. చిన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి. తామరతంపరగా
వారానికి అరడజను సినిమాలు చొప్పున వస్తూనే ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజరాజ చోర
సినిమాలు మినహా చెప్పుకోదగ్గవేం లేవు. అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నవే. వాటిపై ప్రేక్షకుల్లో ఎవ్వరికీ పెద్దగా కంప్లయింట్స్ లేవు. ఒక్క సంపూర్నేష్ బాబు పై తప్ప!

తాజాగా సంపూ నటించిన బజార్ రౌడీ అనే సినిమా వచ్చింది. సంపూర్ణేష్ బాబు పేరు చెప్పగానే ఎవరికైనా
కామెడీ గుర్తొస్తుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కాసేపు సరదాగా నవ్వుకోవచ్చని భావించి చాలామంది సినిమాకు వెళ్లారు. కానీ సంపూ మాత్రం అందరికీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాడు. కామెడీకి కిలోమీటర్ దూరంలో ఈ సినిమాను తీశారు.

సంపూను పెట్టి పక్కా సీరియస్ మూవీ తీయడంతో అంతా అవాక్కయ్యారు. దీనికితోడు అదొక పాత
చింతకాయపచ్చడి కథ. 80వ దశకం నాటి కథనం. దీంతో సోషల్ మీడియాలో సంపూపై ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న థియేటర్లను మూసేయకు బాబూ అంటూ సంపూకు క్లాస్ పీకుతున్నారు చాలామంది.

నిజానికి ఈ 3 వారాల వ్యవథిలో చాలా సినిమాలు వచ్చాయి. 90శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ
సంపూర్ణేష్ బాబు సినిమాకు మాత్రమే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సో.. తనకు కూడా కూసింత క్రేజ్ ఉందనే విషయాన్ని సంపూ గ్రహించాలి. ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో అదే తన సినిమాల్లో చూపించాలి.

First Published:  21 Aug 2021 12:17 PM IST
Next Story