బీసీ వర్సెస్ బీసీ.. హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సురేఖ..?
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ కసరత్తు పూర్తి చేశారు. మూడు పేర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకుల పేర్లు ఈ నివేదికలో ఉన్నట్లు సమాచారం. బీసీ కేటగిరి నుంచి కొండా […]
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ కసరత్తు పూర్తి చేశారు. మూడు పేర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకుల పేర్లు ఈ నివేదికలో ఉన్నట్లు సమాచారం. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లను సిఫారసు చేసినా.. అందులో సురేఖ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటిస్తారని అంటున్నారు.
బీసీ వర్సెస్ బీసీ వర్సెస్ బీసీ..
బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ ఖరారైనా ఇంకా అధికారికంగా పేరు ప్రకటించలేదు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయనే హుజూరాబాద్ అభ్యర్థి అవుతారని చాలామంది భావించారు. కానీ కేసీఆర్ వ్యూహం మార్చారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన కేసీఆర్, హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు. దీంతో బీసీపై బీసీని పోటీకి దింపి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని స్పష్టమైంది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. అటు టీఆర్ఎస్ దళితబంధు ప్రకటించి ఎస్సీ వర్గం ఓట్లను కూడా ఒడిసిపట్టే ప్లాన్ వేసింది. దీంతో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
బీజేపీ, టీఆర్ఎస్ నుంచి కూడా బీసీ అభ్యర్థులే బరిలో ఉండటంతో.. కాంగ్రెస్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దింపడానికి సిద్ధమైందని చెబుతున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలో కొండా సురేఖకు టికెట్ ఖాయం అయిందని అంటున్నారు. మొత్తమ్మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే.. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.