12ఏళ్లు పైబడినవారికి సూదిలేని కోవిడ్ టీకా.. భారత్ అత్యవసర అనుమతి..
ఇప్పటి వరకు భారత్ లో వినియోగంలో ఉన్న టీకాలన్నీ 18ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఇస్తున్నారు. అయితే స్కూళ్లు, కాలేజీలు తెరవడం, విద్యార్థులు దూర ప్రాంతాల్లో హాస్టల్స్ లో ఉండాల్సిన అవసరం రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 12ఏళ్లు పైబడినవారికి ఇచ్చే కోవిడ్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చింది. జేకోవ్-డి అనే పేరుతో జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. […]
ఇప్పటి వరకు భారత్ లో వినియోగంలో ఉన్న టీకాలన్నీ 18ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఇస్తున్నారు. అయితే స్కూళ్లు, కాలేజీలు తెరవడం, విద్యార్థులు దూర ప్రాంతాల్లో హాస్టల్స్ లో ఉండాల్సిన అవసరం రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 12ఏళ్లు పైబడినవారికి ఇచ్చే కోవిడ్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చింది. జేకోవ్-డి అనే పేరుతో జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
అనుమతి పొందిన ఆరో టీకా..
భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాల్లో జైకోవ్-డి ది ఆరోస్థానం. ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. వీటిలో కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. స్పుత్నిక్ టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వినియోగిస్తుండగా.. ప్రభుత్వం ఉచితంగా కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను ప్రజలకు అందిస్తోంది. వీటి సరసన ఇప్పుడు జైకోవ్-డి కూడా చేరుతోంది. దేశంలో ప్రతి ఏటా 10-12 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైడస్ క్యాడిలా తెలిపింది.
సూదిలేని టీకా, మూడు డోసుల టీకా..
మిగతా టీకాలకు భిన్నంగా దీన్ని 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. 12-18 ఏళ్ల వయసు వారికి కూడా దీన్ని ఇవ్వొచ్చు. ఈ వయసువారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి కోవిడ్ టీకా ఇదే. జైకోవ్-డి.. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్ అని బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) తెలిపింది.
జైకోవ్-డి టీకాను వేయడానికి సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ‘ఫార్మాజెట్’ అనే సాధనం ద్వారా దీన్ని నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. వ్యాధి లక్షణాలతో కూడిన కోవిడ్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ వ్యాక్సిన్ 66.6 శాతం సమర్థతను చూపినట్లు మూడో దశ క్లినికల్ ప్రయోగాల ద్వారా తెలిసింది.