Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ గా మారిన మెగాస్టార్

చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. రేపు అట్టహాసంగా తన పుట్టినరోజును జరుపుకుంటున్న మెగాస్టార్ కోసం ఇవాళ్టి నుంచే హంగామా స్టార్ట్ చేశారు అభిమానులు. ఈ సందడికి ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవితో సినిమాలు చేస్తున్న మేకర్స్ కూడా ఓ రేంజ్ లో పండగ షురూ చేశారు. ఇందులో భాగంగా తొలి అప్ డేట్ వచ్చేసింది. చిరంజీవి తాజా చిత్రం టైటిల్ రివీల్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు […]

గాడ్ ఫాదర్ గా మారిన మెగాస్టార్
X

చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. రేపు అట్టహాసంగా తన పుట్టినరోజును జరుపుకుంటున్న మెగాస్టార్ కోసం ఇవాళ్టి నుంచే హంగామా స్టార్ట్ చేశారు అభిమానులు. ఈ సందడికి ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవితో సినిమాలు చేస్తున్న మేకర్స్ కూడా ఓ రేంజ్ లో పండగ షురూ చేశారు. ఇందులో భాగంగా తొలి అప్ డేట్ వచ్చేసింది.

చిరంజీవి తాజా చిత్రం టైటిల్ రివీల్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంలో పెద్ద హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది గాడ్ ఫాదర్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు మెహర్ రమేష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వబోతున్నారు. ఇక రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు చిరంజీవి-బాబి సినిమా అప్ డేట్ ను కూడా అందించబోతున్నారు. ఇలా మెగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరగబోతున్నాయి.

First Published:  21 Aug 2021 12:26 PM IST
Next Story