కొండపొలం.. వైష్ణవ్ నుంచి మరో మూవీ
ఉప్పెన తర్వాత వెంటనే మరో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాడు వైష్ణవ్ తేజ్. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా సందడి మొదలైంది. క్రిష్ దర్శకత్వంలో ఇతడు చేసిన సినిమాకు ఈరోజు టైటిల్ ఎనౌన్స్ చేయడంతో పాటు ఒకేసారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి `కొండపొలం` అనే టైటిల్ డిజైన్, లుక్ పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ గడ్డం, ఇన్‌టెన్స్ లుక్‌తో […]
ఉప్పెన తర్వాత వెంటనే మరో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాడు వైష్ణవ్ తేజ్. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా సందడి మొదలైంది. క్రిష్ దర్శకత్వంలో ఇతడు చేసిన సినిమాకు ఈరోజు టైటిల్ ఎనౌన్స్ చేయడంతో పాటు ఒకేసారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, విడుదల తేదీ కూడా ప్రకటించేశారు.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'కొండపొలం' అనే టైటిల్ డిజైన్, లుక్ పర్‌ఫెక్ట్‌గా
అనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ గడ్డం, ఇన్‌టెన్స్ లుక్‌తో చూడటానికి చాలా హ్యండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. తనే
నేచురల్‌లో ఓ భాగమనే విషయాన్ని పోస్టర్ తెలియజేస్తుంది. అలాగే కొంత మంది అడవిలో నడుచుకుని
వెళుతున్నట్లు తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో గొర్రెలు గడ్డి తింటున్నాయి. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ సినిమాపై
ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక వీడియో చూస్తే అడవిలోని దుండగులు అడ్డుకోవడానికి వైష్ణవ్ తేజ్ వడిసె తిప్పుతూ కనిపించాడు. తన
చూపుల్లో ఓ ఉగ్రం కనిపిస్తుంది. విజువల్స్ గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి. నేపథ్య సంగీతం ఎమోషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతున్నాయి. అక్టోబర్ 8న కొండపొలం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని
నిర్ణయించారు.