Telugu Global
NEWS

ఏపీలో రాత్రి కర్ఫ్యూపై కీలక నిర్ణయం..

ఓవైపు కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నా అక్కడ ఓనమ్ పండగకి వెసులుబాట్లు ఇచ్చి ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. అయితే అలాంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, ఏపీలో మాత్రం కర్ఫ్యూని పొడిగిస్తూ పోతోంది ప్రభుత్వం. తాజాగా రాత్రి కర్ఫ్యూని మరో రెండువారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాత్రి 10గంటలనుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు ఉన్న ఆంక్షలను ఇటీవల రాత్రి 11గంటలనుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా అవే టైమింగ్స్ […]

ఏపీలో రాత్రి కర్ఫ్యూపై కీలక నిర్ణయం..
X

ఓవైపు కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నా అక్కడ ఓనమ్ పండగకి వెసులుబాట్లు ఇచ్చి ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. అయితే అలాంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, ఏపీలో మాత్రం కర్ఫ్యూని పొడిగిస్తూ పోతోంది ప్రభుత్వం. తాజాగా రాత్రి కర్ఫ్యూని మరో రెండువారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాత్రి 10గంటలనుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు ఉన్న ఆంక్షలను ఇటీవల రాత్రి 11గంటలనుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా అవే టైమింగ్స్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీలో రాత్రి 11 గంటల తర్వాత కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వస్తాయి, తెల్లవారు ఝామున 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. సెప్టెంబర్ 4 వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయి. కేసుల సంఖ్య తగ్గుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం కర్ఫ్యూ విషయంలో రాజీపడబోనంటోంది.

ప్రస్తుతం ఏపీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెయ్యి, 1500 లోపే ఉంటున్నాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య కనిష్టానికి పడిపోయింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరగడంతో పగటి కర్ఫ్యూ కూడా కొనసాగిస్తున్నారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మున్సిపాల్టీల పరిధిలో కర్ఫ్యూ అమలవుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కొన్ని చోట్ల వ్యాపారాలకు అనుమతులున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 తర్వాత షాపులు బంద్. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

ఏపీలో స్కూల్స్, కాలేజీలు తెరచిన తర్వాత కాస్త సందడి పెరిగింది. ప్రజా రవాణా వినియోగం కూడా ఎక్కువైంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూని పొడిగించింది. ఏపీలో కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే నైట్ కర్ఫ్యూలో కూడా సడలింపులు ఉంటాయని చెబుతున్నారు అధికారులు.

First Published:  20 Aug 2021 10:00 AM IST
Next Story