Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు మొదలైన బంగార్రాజు

ఏళ్లుగా సాగుతున్న బంగార్రాజు సినిమా ఎట్టకేలకు మొదలైంది. ఈరోజు అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలుపెట్టారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణకృష్ణ దర్శకత్వంలో రాబోతోంది బంగార్రాజు ప్రాజెక్టు. 2016లో హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతోంది బంగార్రాజు. నిజానికి రెండేళ్ల కిందటే సెట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ కల్యాణ్ కృష్ణ చెప్పిన స్క్రీన్ ప్లే నాగార్జునకు నచ్చలేదు. అలా ఏళ్లుగా నడిచిన […]

ఎట్టకేలకు మొదలైన బంగార్రాజు
X

ఏళ్లుగా సాగుతున్న బంగార్రాజు సినిమా ఎట్టకేలకు మొదలైంది. ఈరోజు అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలుపెట్టారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణకృష్ణ దర్శకత్వంలో రాబోతోంది బంగార్రాజు ప్రాజెక్టు.

2016లో హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతోంది బంగార్రాజు. నిజానికి రెండేళ్ల
కిందటే సెట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ కల్యాణ్ కృష్ణ చెప్పిన స్క్రీన్ ప్లే నాగార్జునకు నచ్చలేదు. అలా
ఏళ్లుగా నడిచిన కథాచర్చలు రీసెంట్ గా కొలిక్కి వచ్చాయి. ఈరోజు సినిమా సెట్స్ పైకి వచ్చింది.

ఈ సినిమా కోసం రెండు భారీ సెట్లు నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి స్వర్గం సెట్. ఎక్కువ షూటింగ్ అందులోనే ఉంటుంది. ఇది మల్టీస్టారర్. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. చైతూ సరసన హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు. మనం తర్వాత తండ్రికొడుకులు కలిసి నటిస్తున్న సినిమా ఇదే.

First Published:  20 Aug 2021 2:12 PM IST
Next Story