పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. తగ్గిన సెలవులు.. పెరిగిన పని గంటలు..!
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పాఠశాలలు మూతపడ్డాయి. ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే పాఠశాలలు తెరుచుకున్నాయి.సెకండ్ వేవ్ మొదలవగానే మళ్లీ మూతపడ్డాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఏపీలో ఈ నెల 16వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.మామూలుగా ఈ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటికే రెండు నెలల సమయం వృథా కావడంతో.. ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం […]
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పాఠశాలలు మూతపడ్డాయి. ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే పాఠశాలలు తెరుచుకున్నాయి.సెకండ్ వేవ్ మొదలవగానే మళ్లీ మూతపడ్డాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఏపీలో ఈ నెల 16వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.మామూలుగా ఈ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటికే రెండు నెలల సమయం వృథా కావడంతో.. ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం సెలవులను కుదించింది.
ముఖ్యమైన సంక్రాంతి, దసరా పండుగలకు పాఠశాలలకు పది రోజుల పాటు సెలవులు ఇస్తుండగా.. ఈ విద్యా సంవత్సరం ఐదు రోజుల చొప్పున సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. విద్యా సంవత్సరంలో 188 పనిదినాలు ఉండనున్నాయి. మామూలుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. ఈసారి మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకూ పాఠశాలలను కొనసాగించనున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
పాఠశాల నిర్వహణ సమయాలు
ప్రస్తుతం ఏపీలో ఆరు రకాల పాఠశాలలను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా పాఠశాలలను నిర్వహించాల్సిన సమయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఉన్నత పాఠశాలలు రోజుకు పది గంటలపాటు పని చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉన్నత పూర్వ,ఉన్నత, ఉన్నత ప్లస్ పాఠశాలలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు ఉదయం 9 :05 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పనిచేస్తాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేస్తాయి.
పాఠశాలలకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే..
దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 16 వరకు ఉండనున్నాయి. దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్( మిషనరీ పాఠశాలలకు) డిసెంబర్ 23 నుంచి 30 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు, ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇవ్వనుంది.
పరీక్షల తేదీల వివరాలు
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ 1 పరీక్షలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు జరుగనున్నాయి.6 నుంచి 9వ తరగతులకు సమ్మేటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. సెప్టెంబర్,నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ప్రతి నెల మొదటి, మూడో శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తారు. ప్రతిరోజు ఒక పీరియడ్ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమానికి కేటాయించనున్నారు.9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శుక్రవారం 8వ పీరియడ్ లో కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తారు.