Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్

మొన్నటివరకు సలార్ సినిమా సెకెండ్ షెడ్యూల్ తో బిజీగా గడిపేశాడు ప్రభాస్. ఆ సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు. అవును.. ఆదిపురుష్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. ముంబయిలో నిన్నట్నుంచి ప్రభాస్ ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సెకెండ్ వేవ్/లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముందుగా ఆదిపురుష్ సినిమానే సెట్స్ పైకి వచ్చింది. ఈ […]

ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్
X

మొన్నటివరకు సలార్ సినిమా సెకెండ్ షెడ్యూల్ తో బిజీగా గడిపేశాడు ప్రభాస్. ఆ సినిమా షెడ్యూల్
పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు. అవును.. ఆదిపురుష్
సెట్స్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. ముంబయిలో నిన్నట్నుంచి ప్రభాస్ ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సెకెండ్ వేవ్/లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముందుగా ఆదిపురుష్ సినిమానే సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీ
కోసం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు చేశారు. అయితే అదే టైమ్ లో ముంబయిలో షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం, ముంబయిలో షూట్ చేస్తే కాల్షీట్లు వెంటనే ఇస్తానంటూ సైఫ్ అలీఖాన్ చెప్పడంతో, అక్కడే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అలా ప్రారంభమైన షెడ్యూల్ లోనే ఇప్పుడు ప్రభాస్ జాయిన్ అయ్యాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె సినిమాలున్నాయి. వీటిలో రాధేశ్యామ్
షూటింగ్ పూర్తిచేశాడు ప్రభాస్. సలార్, ఆదిపురష్ సెట్స్ పై ఉన్నాయి. ప్రాజెక్ట్-కె సెట్స్ పైకి వచ్చినప్పటికీ ప్రభాస్ ఇంకా జాయిన్ అవ్వలేదు.

First Published:  18 Aug 2021 3:52 PM IST
Next Story