జగదీశ్ కు లైన్ క్లియర్ చేసిన నాని
శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదంటారు. టాలీవుడ్ లో సినిమా వ్యవహారాలు కూడా అలాంటివే. హీరో క్లియర్ చేస్తే తప్ప అధికారిక ప్రకటన రాదు. టక్ జగదీష్ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశారనేది చాలా పాత వార్త. డీల్ ఎంతకు కుదిరిందో కూడా బయటకొచ్చేసింది. కానీ ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కారణం, నాని నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే. ఎట్టకేలకు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. టక్ […]
శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదంటారు. టాలీవుడ్ లో సినిమా వ్యవహారాలు కూడా అలాంటివే. హీరో క్లియర్ చేస్తే తప్ప అధికారిక ప్రకటన రాదు. టక్ జగదీష్ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశారనేది చాలా పాత వార్త. డీల్ ఎంతకు కుదిరిందో కూడా బయటకొచ్చేసింది. కానీ
ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కారణం, నాని నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే.
ఎట్టకేలకు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. టక్ జగదీష్ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నాని
నుంచి పరోక్షంగా ప్రకటన వచ్చేసింది. నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, వాళ్లకు తన పూర్తి సహాయసహకారాలు అందిస్తానంటూ నాని ప్రకటించేశాడు.
నాని నుంచి ప్రకటన వచ్చేసింది కాబట్టి టక్ జగదీష్ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ ను రేపోమాపో ప్రకటిస్తారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుంది. అటుఇటుగా 50 కోట్ల రూపాయలకు డీల్
కుదిరినట్టు తెలుస్తోంది. శివ నిర్వాణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్.