శ్రీదేవి సోడా సెంటర్ ట్రయిలర్ రేపే
సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే ఊపులో సినిమా ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రయిలర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ ను కూడా యూనిట్ […]
సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే ఊపులో సినిమా ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రయిలర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ ను కూడా యూనిట్ డిఫరెంట్ గా ప్లాన్ చేసింది.
హీరో సుధీర్ బాబు, కమెడియన్ సత్యం రాజేష్ కలిసి శ్రీదేవి సోడా సెంటర్ పోస్టర్ పట్టుకొని వస్తారు. దాన్ని
గోడపై అతికిస్తుంటారు. అందులో ప్రత్యేకత ఏంటంటే.. పోస్టర్ పై సుధీర్ బాబుతో పాటు, మహేష్ బాబు
కనిపిస్తాడు. అలా మహేష్ చేతులు మీదుగా ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్న విషయాన్ని వెరైటీగా,
ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేశారు.
సుధీర్ బాబుకు సంబంధించిన ప్రతి సినిమాలో మహేష్ ప్రమేయం ఉంటుంది. ఫస్ట్ లుక్, టీజర్ లేదా
ట్రయిలర్ లో ఏదో ఒకటి మహేష్ చేతుల మీదుగా విడుదల చేయడం సుధీర్ బాబుకు ఇష్టం. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ట్రయిలర్ ను మహేష్ చేతుల మీదుగా విడుదల చేయాలని నిర్ణయించాడు సుధీర్ బాబు. ఈనెల 27న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.