కోవిషీల్డ్ కావాలంటూ కోర్టులో పిటిషన్.. కుదరదన్న కేంద్రం..
సౌదీ అరేబియాలో కోవాక్సిన్ టీకాను గుర్తించకపోవడం ఇప్పుడో వ్యక్తికి చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే సదరు బాధితుడు కోవిషీల్డ్ టీకా తీసుకోడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోవడం విచిత్రం. దీంతో అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. కేరళలోని కన్నూరుకు చెందిన గిరి కుమార్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో పని చేస్తుంటాడు. జనవరిలో సెకండ్ వేవ్ కారణంగా అతను భారత్ కి తిరిగొచ్చాడు. వీసా నిబంధనల ప్రకారం ఈనెలలో తిరిగి సౌదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అతను […]
సౌదీ అరేబియాలో కోవాక్సిన్ టీకాను గుర్తించకపోవడం ఇప్పుడో వ్యక్తికి చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే సదరు బాధితుడు కోవిషీల్డ్ టీకా తీసుకోడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోవడం విచిత్రం. దీంతో అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. కేరళలోని కన్నూరుకు చెందిన గిరి కుమార్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో పని చేస్తుంటాడు. జనవరిలో సెకండ్ వేవ్ కారణంగా అతను భారత్ కి తిరిగొచ్చాడు. వీసా నిబంధనల ప్రకారం ఈనెలలో తిరిగి సౌదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అతను కోవిన్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకుని ఏప్రిల్ 17న కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు, ఆ తర్వాత నెలకు రెండో డోసు తీసుకున్నాడు. కోవాక్సిన్ కు సౌదీ అరేబియా ఇంకా గుర్తింపునివ్వకపోవడంతో అతను కోవిషీల్డ్ టీకా వేయించుకోవాలనుకున్నాడు. ఈమేరకు టీకా కోసం అతను సంప్రదించగా.. మీకు రెండు డోసులు పూర్తయ్యాయి, ఇక టీకా ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. ప్రైవేటుగా కూడా అతను టీకా వేయించుకోడానికి వీలు లేకుండా కోవిన్ పోర్టల్ లో అన్ని వివరాలు నమోదయ్యాయి. దీంతో అతను కేరళ హైకోర్టుని ఆశ్రయించాడు.
వీసా నిబంధనల ప్రకారం ఈ నెల సౌదీ అరేబియా తిరిగి వెళ్లాల్సి ఉందని, లేదంటే తన ఉద్యోగం పోతుందంటూ కోర్టును ఆశ్రయించాడు గిరి కుమార్. దీంతో కేరళ కోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.
కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మరోసారి వ్యాక్సిన్ వేయలేమని కేంద్రం, కేరళ హైకోర్టుకు తెలిపింది. రెండు కంటే ఎక్కువ టీకాలు పొందిన వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం భారత్ లో ఒక వ్యక్తికి రెండు డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవని చెప్పింది. మూడో డోస్ వేసేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవని స్పష్టం చేసింది. మూడో డోస్ అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని, దీనిపై ఇంకా ఎలాంటి అధ్యయనాలు జరగలేదని చెప్పింది. ఈ కేసులో పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకోలేమని, ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటే మరింత మంది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. దీంతో కేరళ హైకోర్టు కూడా గిరికుమార్ అభ్యర్థనను తోసిపుచ్చింది.