Telugu Global
National

అట్టుడుకుతున్న మేఘాలయ.. సీఎం నివాసంపై పెట్రోలు బాంబు దాడి

మేఘాలయ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధిత తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ నేత చెరిస్టర్ ఫీల్డ్ థాంగ్ కీను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెరిస్టర్ ఫీల్డ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా వారు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ తదితర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, పోలీసు వాహనాలను తగలబెట్టారు. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు షిల్లాంగ్ లో ఆదివారం సాయంత్రం ఆరు నుంచి 48 గంటలపాటు […]

అట్టుడుకుతున్న మేఘాలయ.. సీఎం నివాసంపై పెట్రోలు బాంబు దాడి
X

మేఘాలయ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధిత తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ నేత చెరిస్టర్ ఫీల్డ్ థాంగ్ కీను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెరిస్టర్ ఫీల్డ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా వారు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ తదితర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, పోలీసు వాహనాలను తగలబెట్టారు. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు షిల్లాంగ్ లో ఆదివారం సాయంత్రం ఆరు నుంచి 48 గంటలపాటు కర్ఫ్యూ విధించారు.

చెరిస్టర్ ఫీల్డ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ వ్యవస్థాపకుల్లో ఒకరు. మేఘాలయ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తుంటారని ఆయన మద్దతుదారులు చెబుతుంటారు. అయితే ఇటీవల మేఘాలయ రాష్ట్రంలోని లైతుమ్ క్రహ్ లో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో చెరిస్టర్ కు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెరిస్టర్ ను అదుపులోకి తీసుకునేందుకు అతడి ఇంటిపై దాడి చేశారు. అయితే చెరిస్టర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వారి పై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతన్ని కాల్చిచంపారు.

తమ నేతను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై చెరిస్టర్ మద్దతుదారులు రగిలిపోయారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై వారు పెట్రోలు బాంబు దాడి చేశారు. రెండు మోలోటోవ్ కాక్‌టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడింది. రెండవది పెరడు వెనుక వైపు విసిరివేశారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఆందోళనకారులు పెట్రోలు బాంబు దాడికి పాల్పడ్డ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన అధికారిక నివాసంలో ఉంటున్నారు.

మేఘాలయాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు.చెరిస్టర్ మృతిపై నిరసనలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. చెరిస్టర్ ఎన్ కౌంటర్ ఘటనను మేఘాలయా మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది.

First Published:  16 Aug 2021 8:15 AM IST
Next Story