పుష్ప.. లీకుల మీద లీకులు
పుష్ప సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. అయితే ఓ వైపు ఎన్ని అప్ డేట్స్ ఇస్తున్నప్పటికీ, మరోవైపు అన్ని లీకులు కూడా వస్తున్నాయి. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని స్టిల్స్ లీక్ అవ్వగా, తాజాగా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి ఏకంగా వీడియోలు లీక్ అవ్వడం సంచలనంగా మారింది. తాజాగా పుష్ప లీక్స్ అంటూ మరికొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. అందులో ఒకటి ఎడిటింగ్ […]
పుష్ప సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. అయితే ఓ వైపు
ఎన్ని అప్ డేట్స్ ఇస్తున్నప్పటికీ, మరోవైపు అన్ని లీకులు కూడా వస్తున్నాయి. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని స్టిల్స్ లీక్ అవ్వగా, తాజాగా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు
సంబంధించి ఏకంగా వీడియోలు లీక్ అవ్వడం సంచలనంగా మారింది.
తాజాగా పుష్ప లీక్స్ అంటూ మరికొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. అందులో ఒకటి
ఎడిటింగ్ జరుగుతుండగా లీక్ అవ్వడం ఆశ్చర్యం. అసలు వరుసగా ఇన్ని లీకులు జరుగుతుంటే పుష్ప టీం ఏం చేస్తుంది ? వీడియో క్లిప్స్ లీకవ్వకుండా ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఇలా ఇన్ని లీకులు జరుగుతుంటే పైగా వాటిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ కనిపిస్తుంటే మేకర్స్ చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బన్నీ-రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. పుష్ప పార్ట్-1 ది రైజ్ ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.