Telugu Global
National

కరోనా గుప్పెట్లో కేరళ.. 15శాతం పాజిటివిటీ రేటు..

కేరళలో కరోనా కేసులు ఎంతకీ తగ్గడంలేదు సరికదా భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్త రోజువారీ కొవిడ్ పాజిటివ్ కేసుల్లో కేరళ వాటా 50శాతం నుంచి 60శాతానికి ఎగబాకింది. అంతే కాదు, పాజిటివిటీ రేటు కూడా 15.11శాతంగా నమోదైంది. అంటే కేరళలో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న ప్రతి 100మందిలో 15మందికి పాజిటివ్ గా నిర్థారణ అవుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కేరళలో కొత్త‌గా 18,582 మందికి పాజిటివ్ గా తేలింది. క‌రోనా రిక‌వ‌రీలు అంత‌కంటే ఎక్కువగా ఉండటం ఒక్కటే […]

కరోనా గుప్పెట్లో కేరళ.. 15శాతం పాజిటివిటీ రేటు..
X

కేరళలో కరోనా కేసులు ఎంతకీ తగ్గడంలేదు సరికదా భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్త రోజువారీ కొవిడ్ పాజిటివ్ కేసుల్లో కేరళ వాటా 50శాతం నుంచి 60శాతానికి ఎగబాకింది. అంతే కాదు, పాజిటివిటీ రేటు కూడా 15.11శాతంగా నమోదైంది. అంటే కేరళలో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న ప్రతి 100మందిలో 15మందికి పాజిటివ్ గా నిర్థారణ అవుతోంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో కేరళలో కొత్త‌గా 18,582 మందికి పాజిటివ్ గా తేలింది. క‌రోనా రిక‌వ‌రీలు అంత‌కంటే ఎక్కువగా ఉండటం ఒక్కటే కాస్త సంతోషించదగ్గ పరిణామం. ఒకరోజు వ్యవధిలో 20,089 మంది క‌రోనానుంచి కోలుకున్నారు. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా కేర‌ళ‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. ఒకరోజులో 102 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 18,601కి పెరిగింది. రిక‌వ‌రీలు, మ‌ర‌ణాలు పోను ప్రస్తుతం కేరళలో 1,78,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిబంధనల సడలింపే కొంప ముంచుతుందా..?
గతంలో బక్రీద్ పండగకోసం కేరళలో లాక్ డౌన్ నిబంధనలు సడలించారు. ఇప్పుడు ఓనమ్ పండగ కోసం నిబంధనల్లో మార్పు తీసుకొచ్చారు. ఈనెల 12న ప్రారంభమైన ఓనమ్ ఉత్సవాలు 23న ముగుస్తాయి. ఈ సందర్భంగా షాపింగ్, ఇతర అవసరాలకోసం సడలింపులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో, వ్యాక్సిన్ వేయించుకున్నవారికే షాపుల్లోకి ఎంట్రీ అంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినా కూడా అక్కడ పరిస్థితిలో మార్పు రాలేదు. ఓనమ్ ఉత్సవాలు ముగిసే నాటికి కేరళలో పరిస్థితి మరింత దిగజారుతుందని అంచనాలున్నాయి. అదే జరిగితే కొవిడ్ కట్టడిలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టే. తమ వైఫల్యాలకు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్టే.

First Published:  15 Aug 2021 9:07 PM GMT
Next Story