Telugu Global
NEWS

ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా తిరుమలలో మరో ముందడుగు..

తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది టీటీడీ. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంపై నిషేధం విధించింది. కొండపైకి ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లకుండా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు సిబ్బంది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలు, స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసులు జలప్రసాదం కౌంటర్లలో ఉంచుతున్నారు. తాజాగా ప్లాస్టిక్ కవర్ల బదులు, సీడ్ ఎంబడెడ్ కవర్లను ప్రసాద వితరణకు వినియోగిస్తున్నారు. ఇకపై తులసి ప్రసాదం.. తిరుమలలో అనుమతించిన మైక్రాన్ల మందంతో తయారయ్యే ప్లాస్టిక్ […]

ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా తిరుమలలో మరో ముందడుగు..
X

తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది టీటీడీ. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంపై నిషేధం విధించింది. కొండపైకి ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లకుండా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు సిబ్బంది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలు, స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసులు జలప్రసాదం కౌంటర్లలో ఉంచుతున్నారు. తాజాగా ప్లాస్టిక్ కవర్ల బదులు, సీడ్ ఎంబడెడ్ కవర్లను ప్రసాద వితరణకు వినియోగిస్తున్నారు.

ఇకపై తులసి ప్రసాదం..
తిరుమలలో అనుమతించిన మైక్రాన్ల మందంతో తయారయ్యే ప్లాస్టిక్ కవర్లను ఇప్పటి వరకూ ప్రసాదం అమ్మకాల కౌంటర్లలో పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో ఆపేసింది టీటీడీ. ఇకపై వాటి స్థానంలో సీడ్ ఎంబడెడ్ కవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రీన్ మంత్ర అనే సంస్థతో కలసి ఈ కవర్లను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ.

తిరుమల యాత్రకు గుర్తుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క..
తిరుమల ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కవర్ ని పక్కనపడేయకుండా.. ఓ మట్టి కుండీలో వేసి నీళ్లు పోయాలి. ప్రసాదం కవర్ మట్టిలో కలసిపోవడమే కాదు, అందులోనుంచి తులసి మొక్కలు వస్తాయి. దానికోసం తులసి గింజలను ఆ కవర్లలో పెడుతున్నారు. మట్టిలో కలసిపోయే బయోడీగ్రేడబుల్ పదార్ధాలతోనే వాటిని తయారు చేశారు. చెట్ల బెరడు, కందమూలాలు వీటి తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ కవర్లు యూజ్ అండ్ త్రో కాదని, పాడైపోయే వరకు వాటిని మరలా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. పనికి రావు అనుకున్నప్పుడు వాటిని మట్టిలో పెట్టి నీరు పోస్తే మొక్కలు వస్తాయి. మట్టి, నీరు తగిలేంత వరకు అవి డీకంపోజ్ కావని స్పష్టం చేశారు గ్రీన్ మంత్ర సంస్థ ప్రతినిధులు.

భారత్ లో తొలి క్షేత్రం..
భారత్ తొలి ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా తిరుమలకు పేరు తెచ్చేందుకు కృషిచేస్తోంది టీటీడీ. గతంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి స్వస్తి పలికిన టీటీడీ, ఇప్పటి వరకూ పునర్వినియోగ ప్లాస్టిక్ ని అనుమతించింది. తాజాగా.. దాన్ని కూడా కాదని పూర్తిగా ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయాలను తెరపైకి తెస్తోంది. ఇతర పుణ్యక్షేత్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

First Published:  15 Aug 2021 10:46 PM GMT
Next Story