Telugu Global
NEWS

బీజేపీ నేతకు జగన్‌ ప్రభుత్వంలో కీలక పదవి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల చేసిన పదవుల పందారంలో బీజేపీ నేతకు కీలక పదవి లభించింది. అదేమిటని ఆశ్చర్య పోతున్నారా! ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్వీ రమణారెడ్డి రెండో కోడలు మల్లెల ఝాన్సీరాణికి ఆప్కాబ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. ఓ మహిళకు కీలక పదవి లభించిందని సంతోషించినా.. ఆమె భారతీయ కిసాన్‌ సంఘ్‌లో క్రియాశీల నేత కావడమే విశేషం. ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ పరివార్‌ అనుబంధంగా ఉండే కిసాన్‌ సంఘ్‌లో పనిచేసే ఆమెకు జగన్‌ ఏరికోరి పదవిని ఇచ్చారు. […]

బీజేపీ నేతకు జగన్‌ ప్రభుత్వంలో కీలక పదవి
X

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల చేసిన పదవుల పందారంలో బీజేపీ నేతకు కీలక పదవి లభించింది. అదేమిటని ఆశ్చర్య పోతున్నారా! ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్వీ రమణారెడ్డి రెండో కోడలు మల్లెల ఝాన్సీరాణికి ఆప్కాబ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. ఓ మహిళకు కీలక పదవి లభించిందని సంతోషించినా.. ఆమె భారతీయ కిసాన్‌ సంఘ్‌లో క్రియాశీల నేత కావడమే విశేషం. ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ పరివార్‌ అనుబంధంగా ఉండే కిసాన్‌ సంఘ్‌లో పనిచేసే ఆమెకు జగన్‌ ఏరికోరి పదవిని ఇచ్చారు.

ఎలాగంటారా? వైఎస్సార్‌సీపీలో ఉన్నాడో లేడో తెలియని ఎమ్వీ రమణారెడ్డి అనుకూల పరిస్థితులను బట్టి వైఎస్సార్‌సీపీకి మద్దతునిస్తూ ఉంటారు. ఈ సారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా రాష్ట్రస్థాయి అధికార పదవిని కట్టబెడతామని ఎమ్వీఆర్‌ కుటుంబానికి జగన్‌ తరపున హామీ ఇచ్చారట. మరి అధికారంలోకి వచ్చారు కదా! మీ కుటుంబం నుంచి ఎవరైనా మహిళను సూచిస్తే వారికి పదవి ఇస్తానని మొన్నటి పందారానికి ముందు రమణారెడ్డికి కబురంపితే.. ఆయన తన రెండో కోడలు మల్లెల ఝాన్సీరాణి పేరు చెప్పారట. అలా ఆమెకు ఆప్కాబ్‌ పదవి లభించింది. అప్పటికే ఆమె సంఘ్‌లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. అసలు కిసాన్‌ సంఘ్‌కూ బీజేపీకి ఏం సంబంధం అని ఎవరైనా అమాయకులు ప్రశ్నించొచ్చు. సంఘ్‌ పరివార్‌కూ బీజేపీకి అసలు సంబంధమే లేదని చెప్పే మహానుభావులూ లేక పోలేదు.

ఇదంతా ఒక ఎత్తైతే.. సదరు మల్లెల ఝాన్సీరాణికి ఆగస్టు 15వ తేదీన ప్రొద్దుటూరులో కిసాన్‌ సంఘ్‌ ఆధ్యర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. మన సంఘ్‌కు (ఆరెస్సెస్‌) చెందిన ఓ నాయకురాలికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించడం సంతోషమని అందరూ ప్రశంసించారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే సదరు ఝాన్సీరాణి మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సోదరి. (భూమా నాగిరెడ్డి సోదరుడు దివంగత భూమా శేఖర్‌రెడ్డి కుమార్తె) ఆమెను రమణారెడ్డి తన కుమారుడికి పెళ్లి చేసుకున్నారు. ఈ బంధాలన్నీ బాగున్నాయి. జగన్‌ సంక్షోభంలో ఉన్న నాటి నుంచీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయనకు మద్దతునిచ్చి వెంట నడిచివారు మాత్రం ఇదేం చోద్యం అని ఆవేదన చెందుతున్నారు. ఢక్కామొక్కీలు తిన్న మేము పనికిరాకుండా పోయామని అంటున్నారు. ఈ పందారంలో ఎంద‌రో టీడీపీ నేత‌ల‌కు కూడా కీలక పదవులు లభించాయని, నాయకుడు ఇంత కళ్లు మూసుకుంటే ఎలా? అని కొందరు సీనియర్‌ నేతలు తమ అంతరంగిక చ‌ర్చ‌ల్లో వాపోతున్నారు.

First Published:  16 Aug 2021 6:13 AM IST
Next Story