Telugu Global
National

అన్ని కులాల వారు అర్చకులే.. స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ఆ పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. స్టాలిన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటుండగా.. వాహనదారులకు ఉపశమనం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం […]

అన్ని కులాల వారు అర్చకులే.. స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
X

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ఆ పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. స్టాలిన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటుండగా.. వాహనదారులకు ఉపశమనం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం లేదు. కనీసం రాష్ట్ర స్థాయిలో విధించే పన్నును కూడా తగ్గించుకోవడం లేదు.

కానీ తమిళనాడు ప్రభుత్వం తాజాగా లీటరు పెట్రోల్ పై రూ.3 ధర తగ్గించింది. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహనదారులకు ఎంతో ఊరటనిచ్చింది.తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల్లో అన్ని కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించారు. ఎన్నికల హామీల్లో భాగంగా స్టాలిన్ తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని కులాల వారికి అర్చకులుగా అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ముందు చెప్పినట్లుగానే స్టాలిన్ తన మాటను నెరవేర్చుకున్నారు.

వివిధ కులాలకు చెందిన 24 మందిని రాష్ట్రంలోని పలు ఆలయాల్లో అర్చకులుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అర్చకులుగా నియమితులైన వారికి ముందుగానే తగిన శిక్షణ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయిన సందర్భంగా స్టాలిన్ ఈ నియామకాలు చేపట్టారు. దేశంలో ఇప్పటివరకు బ్రాహ్మణ వర్గంలో పుట్టిన వారు మాత్రమే అర్చకులుగా కొనసాగుతున్నారు. ఇతర కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించడం ఇదే తొలిసారి. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

First Published:  15 Aug 2021 12:14 PM IST
Next Story