Telugu Global
NEWS

ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు కండిషన్లు ఇవే..

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా కేసులు 10శాతం లోపు ఉండే ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచేందుకు అనుమతి లేదని, స్థానిక అధికారులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మాస్క్, శైనిటైజర్, సామాజిక దూరం తప్పనిసరి చేస్తూనే.. మరికొన్ని నిబంధనలు కూడా విధించింది ప్రభుత్వం. – […]

ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు కండిషన్లు ఇవే..
X

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా కేసులు 10శాతం లోపు ఉండే ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచేందుకు అనుమతి లేదని, స్థానిక అధికారులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మాస్క్, శైనిటైజర్, సామాజిక దూరం తప్పనిసరి చేస్తూనే.. మరికొన్ని నిబంధనలు కూడా విధించింది ప్రభుత్వం.

– స్కూల్ కి వచ్చే ప్రతి పిల్లవాడి తరపున తల్లిదండ్రులు అనుమతి పత్రం రాసివ్వాలి.
– స్కూల్ వ్యాన్స్ లో సగం మంది పిల్లలకే అనుమతి, ఆటోలు, రిక్షాల్లో రాకూడదు. తల్లిదండ్రులే వారిని వ్యక్తిగతంగా తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లాలి.
– ఇంట్లో ముసలివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పెద్దవారితో కలసి ఉండే పిల్లలకు స్కూల్స్ లో నో ఎంట్రీ.
– ఉదయం అసెంబ్లీ, సాయంత్రం స్పోర్ట్స్.. ఇకపై ఉండవు
– ఒక్కో తరగతి గదిలో 20మంది విద్యార్థులకంటే మించి ఉండకూడదు
– క్లాస్ రూమ్స్ కొరత ఉంటే 6, 7 తరగతులను ఒకరోజు, 8, 9, 10 తరగతులను మరుసటి రోజు తరగతులు నిర్వహించాలి.
– స్కూల్ లో పిల్లలు పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్స్.. లాంటివి మార్చుకోకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలి.
– ప్రతి రోజూ పిల్లలకు, ఉపాధ్యాయులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
– ప్రతివారం ఒక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహించాలి. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే మొత్తం అందరికీ పరీక్షలు చేయించాలి.

ఏపీ ప్రభుత్వం స్కూల్స్ తెరిచేందుకు సాహసించినా, కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గలేదు. దీంతో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ స్కూల్స్ తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఎక్కడైనా కేసుల సంఖ్య 10శాతం కంటే పెరిగితే.. ఆ ప్రాంతాల్లో వెంటనే స్కూల్స్ మూసివేసేలా ఆదేశాలిచ్చారు.

First Published:  15 Aug 2021 1:47 AM IST
Next Story