Telugu Global
Cinema & Entertainment

భీమ్లా నాయక్ దుమ్ముదులిపాడుగా..!

ఈరోజు పొద్దున్నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దానికి కారణం పవన్ కొత్త సినిమా నుంచి సందడి మొదలవ్వడమే. అయితే ఫ్యాన్స్ మాత్రం డబుల్, ట్రిపుల్ ఫెస్టివల్స్ చేసుకున్నారు. దీనికి ఓ కారణం ఉంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ చేస్తున్న కొత్త సినిమాకు భీమ్లా నాయక్ అనే పేరు పెట్టారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు సింగిల్ పోస్టర్ తో జరుగుతాయి. టైటిల్ చెప్పి ఊరుకుంటారు. కానీ ఈరోజు వ్యవహారం ఇలా సాగలేదు. భీమ్లానాయక్ టైటిల్ తో పోస్టర్ వచ్చింది. […]

భీమ్లా నాయక్ దుమ్ముదులిపాడుగా..!
X

ఈరోజు పొద్దున్నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దానికి కారణం పవన్ కొత్త
సినిమా నుంచి సందడి మొదలవ్వడమే. అయితే ఫ్యాన్స్ మాత్రం డబుల్, ట్రిపుల్ ఫెస్టివల్స్ చేసుకున్నారు. దీనికి ఓ కారణం ఉంది.

సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ చేస్తున్న కొత్త సినిమాకు భీమ్లా నాయక్ అనే పేరు పెట్టారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు సింగిల్ పోస్టర్ తో జరుగుతాయి. టైటిల్ చెప్పి ఊరుకుంటారు. కానీ ఈరోజు వ్యవహారం ఇలా సాగలేదు.

భీమ్లానాయక్ టైటిల్ తో పోస్టర్ వచ్చింది. అదే భీమ్లానాయక్ టైటిల్ తో పవన్ కల్యాణ్ కొత్త స్టిల్ రిలీజైంది.
అక్కడితో కూడా ఆగలేదు యూనిట్. భీమ్లా నాయక్ ఎగ్రెసివ్ లుక్ చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
అందులో పవన్ లుంగీ పైకి ఎగ్గట్టి ఫైట్ చేసిన సీన్ ఉంది. ఇక్కడితో ఆగిపోలేదు. ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.

ఇలా ఒకేసారి సినిమా నుంచి ఇన్ని అప్ డేట్స్ వచ్చేయడంతో ఫ్యాన్స్ పండగ మీద పండగ చేసుకున్నారు. వీడియో, స్టిల్స్, పోస్టర్లను వైరల్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈరోజు భీమ్లా నాయక్ డే.

First Published:  15 Aug 2021 4:12 PM IST
Next Story