Telugu Global
NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. సీఎం జగన్ ప్రకటన..!

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 26 నెలలుగా రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.83 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. పంట సాగులో రైతులకు పెట్టు బడి సాయంగా ఇప్పటివరకు రూ.17 […]

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. సీఎం జగన్ ప్రకటన..!
X

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 26 నెలలుగా రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.83 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు.

పంట సాగులో రైతులకు పెట్టు బడి సాయంగా ఇప్పటివరకు రూ.17 వేల కోట్లు అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎరువులు, పురుగుమందులు అందజేయడంతో పాటు రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఏటా రూ. 13500 చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నామన్నారు.

గ్రామ వార్డు సచివాలయ ఏర్పాటు ద్వారా లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్న పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నాడు- నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నామని సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు పిల్లల చదువుల కోసం రూ. 26,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు.జగనన్న గోరుముద్ద ద్వారా 36 లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

First Published:  15 Aug 2021 6:32 AM GMT
Next Story